జగన్ మోహన్ రెడ్డికి, వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు మరో లేఖ రాసారు. పది రోజుల క్రితం, పెన్షన్ల పెంపు అంశం ఏమైంది అంటూ, జగన్ కు రఘురామరాజు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ రోజు మరో లేఖ రాస్తూ, భావన నిర్మాణ కార్మికుల సంక్షేమం పై, లేఖ రసారు. లాక్ డౌన్ ప్రభావం వల్ల ఉపాధి కోల్పోయిన, భవన నిర్మాణ కార్మికలను ఆదుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల 60 వేల మంది భవన నిర్మాణ కార్మికులు తమ పేరును నమోదు చేసుకున్నారని, వారిలో పది లక్షల 66 వేల మంది కార్మికుల వివరాలు మాత్రమే ఆధార్ తో లింక్ చేసారని, మిగిలిన వారి పేర్లు కూడా లింక్ చెయ్యాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2019 మధ్య కాలంలో, బిల్డర్స్ నుంచి, సంక్షేమ నిధి రూపేణా, 1364 కోట్లు వసూలు చేసారని, అయితే దీనిలో, 330 కోట్లు ఖర్చు చేసారని, మిగిలిన వెయ్యి కోట్ల నుంచి, ఒక్కో కార్మికుడికి, 5 వేలు రూపాయలు ఇవ్వచ్చు అని, అలా ఇవ్వాలని కోరారు.

కేంద్ర హోం సెక్రటేరి అజయ్ బల్లాతో, వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు సమావేశం అయ్యారు. గత మూడు రోజులుగా రఘురామ రాజు ఢిల్లీలోనే ఉన్నారు. తాను ఇది వరకు ఇచ్చిన ఫిర్యాదు సంబంధించి, ఆయన అరా తీసారు. తాను, రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు ఇచ్చానని, అప్పటి నుంచి తనను టార్గెట్ చేస్తూ, చంపేస్తాం అని బెదిరించారని ఆ విషయాలు అన్నీ తెలిపారు. ఇప్పటికే స్పీకర్ కు ఇచ్చిన లేఖ, కేంద్ర హోం శాఖకు పంపించిన విషయం తెలిసిందే. కేంద్ర హోం శాఖ ఇప్పటికే, దీనికి సంబంధించి సమాచారం తెప్పించుకుంటుంది. ఈ విషయం పై తగు సమాచారం తెప్పించుకుంటున్న నేపధ్యంలో, కేంద్ర హోం శాఖ కార్యదర్శితో రఘురామ రాజు భేటీ కీలకంగా మారింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా, పట్టించుకోక పోవటంతో, ఆయన తాను ఢిల్లీ రావాల్సి వచ్చిందని అన్నారు. అయితే ఇది కేంద్రం ఇవ్వాలా, రాష్ట్రం ఇవ్వాలా అనే విషయం పై, తర్జనబర్జనలు జరుగుతున్నాయని, అవి సెట్ అవ్వగానే, తనకు భద్రత వస్తుందనే నమ్మకం ఉందని రఘురామకృష్ణం రాజు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read