ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త వివాదం మొదలైంది. అప్పులకు సబంధించి, ప్రభుత్వం చేస్తున్న పని, పలు అనుమానాలకు కారణం అవుతుంది. ప్రతిపక్షాలు ఈ విషయం పై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఒక పక్క అప్పులు రాష్ట్రంగా ఏపిని చెయ్యటమే కాక, ప్రైవేటు వ్యక్తుల చేతిలో, రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని, ఆరోపిస్తున్నాయి. తాజాగా అమెరికాలోని ఒక ప్రైవేటు సంస్థ నుంచి, భారీ అప్పు తేవాలని, రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న వార్తలు వస్తున్నాయి. ముందుగా, మొదటి విడతగా రూ.7500 కోట్ల రూపాయలు ఒక ప్రైవేటు సంస్థ నుంచి, అప్పు తీసుకురావటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయం పైనే, ఆర్ధిక మంత్రి బుగ్గన, రెండు రోజుల క్రిందట, కేంద్ర ఆర్ధిక మంత్రిని కలిసి, ప్రైవేటు సంస్థ నుంచి అప్పు తీసుకుంటానికి, పర్మిషన్ అడిగినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయం పై అఫిషియల్ గా, నిన్న రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ కూడా ప్రకటించారు. అవును ఒక ప్రైవేటు సంస్థ నుంచి అప్పు తెస్తే, తప్పు ఏంటి అనే ప్రశ్న ఆయన ఎదురు ప్రశ్నించారు. అయితే ఇప్పటి వరకు, ఏడీబీ, జైకా లాంటి ప్రభుత్వ సంస్థల నుంచి మాత్రమే, విదేశాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు తెచ్చాయి. వీటికి కేంద్రంతో సంప్రదింపులు ఉంటాయి కాబట్టి, ఏదైనా సమస్య వచ్చినా, వెంటనే కేంద్రం జోక్యం చేసుకుంటుంది, ఇవ్వాల్సిన హామీలు ఇస్తుంది.
అయితే ఒక ప్రైవేటు సంస్థ అదీ ఇంత పెద్ద మొత్తంలో, ఒత్తినే రుణాలు ఇవ్వదు. వడ్డీ అధికమే కాక, దాని వెనుక అనేక నిబంధనలు కూడా ఉంటాయి. ఇప్పుడు అదే చర్చగా మారింది. ఇప్పుడు వరకు ఏ రాష్ట్రం చెయ్యని పని, మన రాష్ట్రం చేస్తుంది. ఇలా ఎందుకు చేస్తుంది ? దీని వెనుక ఉన్న ఇంట్రెస్ట్ ఏమిటి అనే అనుమానాలు వస్తున్నాయి. అయితే ఈ రోజు వచ్చిన ఒక పత్రిక కధనం ప్రకారం, కొన్ని రోజుల క్రిందట ఒక వ్యకి వచ్చి, మీకు రుణాలు పుట్టటం లేదు కదా, ఎంత లోన్ అయినా ఇప్పిస్తాను, కానీ మేము డాలర్లలో ఇస్తాం, మీరు రూపాయల్లో చెల్లించాలి అని షరతు పెట్టినట్టు సమాచారం. అయితే ఆ వ్యక్తి డైరెక్ట్ గా సచివాలయానికి వచ్చి, ఈ ఆఫర్ ఇవ్వటం వెనుక, ఒక కీలక అధికారి ఉన్నారని, ప్రచారం జరుగుతుంది అంటూ, ఆ పత్రిక కధనం. అయితే, ఇవన్నీ పక్కన పెడితే, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి, ఎలాంటి గ్యారంటీ ఇవ్వకుండా, ప్రైవేటు సంస్థ అప్పు ఇవ్వదు. అదీ ఆర్ధిక పరిస్థితి దిగజారుతున్న మన రాష్ట్రం లాంటి వాటికి అసలు ఇవ్వరు. మరి ఏ షరతులు మీద అప్పు ఇస్తాం అంటున్నారు ? ఇప్పుడు ఇదే చర్చ. ఇది చాలా ప్రమాదం అని, ఇలాంటివి ఒప్పుకోకూడదు అని, కేంద్రానికి ఆర్ధిక నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు.