2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత, నవ్యాంధ్ర నెత్తిన అప్పుల భారం పడింది. రాష్ట్రం మొదలు అవ్వటంతోనే, అప్పులతో మొదలైంది. సహజంగా తీసుకొనే అప్పులతో, అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ముందుకు వెళ్ళారు. దాదపుగా లక్షా ఆరు వేల కోట్లు అప్పు, 2014-2019 మధ్య తీసుకున్నారని, ఇప్పటికే ప్రభుత్వమే చెప్పింది. అంటే సగటున ఏడాదికి 25 వేల కోట్లు. అయితే, అప్పట్లో దీనికే, రాష్ట్రం అప్పుల పాలు అయిపోతుంది అంటూ, అప్పటి ప్రతిపక్షం వైసీపీ గోల గోల చేసింది. చంద్రబాబుని దించి, వీళ్ళు అధికారంలోకి వచ్చారు. అయితే చంద్రబాబు 5 ఏళ్ళలో చేసిన అప్పు, వైసీపీ ప్రభుత్వం, ఒక్క ఏడాదిలోనే చేసింది అనే వార్తలు వచ్చాయి. అయితే అప్పట్లో చంద్రబాబు చేసిన అప్పు తాలూకు ఫలాలు కళ్ళ ముందు కనిపించాయి. పోలవరం కట్టటం కాని, ప్రతి వేధిలో సిమెంట్ రోడ్డు, వివిధ సాగు నీటి ప్రాజెక్టులు, పంచాయతీ బిల్డింగ్స్, స్కూల్స్, నీటి సమస్య పరిష్కారంలో, ఇలా ఖర్చు పెట్టారు. అయితే ఇప్పుడు తీసుకున్న అప్పు మొత్తం, సంక్షేమ పధకాల కింద ఖర్చుకే వెళ్ళిపోతుంది అనే విమర్శలు వచ్చాయి.
అయితే తాజగా ఇచ్చిన ఆర్బిఐ రిపోర్ట్ లో, సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యధిక అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో నిలిచింది. జగన్ వచ్చిన ఏడాది 2019-20 కాలానికి, మన రాష్ట్రం అప్పులు తీసుకోవటంలో 6వ స్థానంలో ఉంటే, ఇప్పుడు ఈ ఆర్ధిక ఏడాది, రెండు నెలలకే, మూడవ స్థానంలో ఉంది. ఆర్బిఐ రిపోర్ట్ ప్రకారం, ఆంధ్రప్రదేశ్ అప్పులు, 2018-19 కాలంతో పోలిస్తే, 42.10 శాతం ఎక్కువ. 2020 ఆర్ధిక ఏడాదిలో, ఏప్రిల్, మే నెలలో, ఈ రెండు నెలల్లోనే, రాష్ట్రం 10 వేల కోట్లు అప్పు చేసింది. దీంతో ఆరవ స్థానం నుంచి మూడవ స్థానికి ఎగబాకింది. మొదటి రెండు స్థానాల్లో, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది. ఆ రెండు అతి పెద్ద రాష్ట్రాలు. మన రాష్ట్రం అందులో సగం కూడా ఉండదు. దీంతో ఈ ఏడాది మన రాష్ట్రం తీసుకునే అప్పుల్లో, అన్ని రాష్ట్రాలను దాటుకుని, మొదటి స్థానానికి వచ్చినా ఆశ్చర్యం లేదు అనే విమర్శలు వస్తున్నాయి. ఇక మరో పక్క, విదేశాల్లో ఉన్న ప్రైవేటు కంపెనీల నుంచి కూడా ఏపి ప్రభుత్వం అప్పుకు ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.