108 అంబులెన్స్ ల కుంభకోణం గురించి, మొదటిగా బయట పెట్టింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ. ఆయన లేఖ రాస్తూ, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయంలో కుదుర్చుకున్న ఒప్పందంలో, అంబులెన్స్ ల నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉంది, అయినా ఆ ఒప్పందం ఇంకా అమలులో ఉండగానే, వాళ్ళని కాదని, ఇప్పుడు ఎక్కువ రేటుకు అరబిందో ఫౌండేషన్ కి, గతం కంటే, ఎక్కువ రేటుకి ఎలా ఇచ్చారు అని ప్రశ్నించారు. అరబిందో ఫౌండేషన్, విజయసాయి రెడ్డి అల్లుడిది కాబట్టి, దీని పై తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. అయితే ఆ లేఖ తరువాత, తెలుగుదేశం పార్టీ దీన్ని మరింత ముందుకు తీసుకు వెళ్ళింది. టిడిపి నేత పట్టాభి మరిన్ని ఆధారాలు చూపించటంతో, 108 స్కాం బయట పడింది. అన్నిటికీ విరుచుకు పడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పటి వరకు దీని పై సమాధానం చెప్పలేక పోయింది. అయితే, ఈ స్కాంని బయట పెట్టిన బీజేపీ ఇప్పుడు మరో బాంబు పేల్చుతూ, రాష్ట్ర ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తుంది.
1088 అంబులెన్స్ ప్రారంభం చేసాం అంటూ, రాష్ట్ర ప్రభుత్వం హడావిడి చేసి, ఊరేగింపు చేసి, రోడ్డు మీద ట్రాఫ్ఫిక్ ఆపేసి, చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇప్పుడే 108 కనిపెట్టాం అనే విధంగా, వైసీపీ హడావిడి చేసింది. అయితే ఈ 1088 వాహనాలు కొత్తవి కాదనే వాదన కూడా ఉంది. పాట అంబులెన్స్ లకు కూడా కొత్త రంగులు వేసారని, కావాలంటే ఎక్కడైనా పాత రంగులలో అంబులెన్స్ లేవు అంటూ వాదించే వారు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు బీజేపీ మరో విషయం చెప్తుంది. ఈ వాహనాల కొనుగోలుకు నేషనల్ హెల్త్ మిషన్ ప్రాజెక్ట్ లో భాగంగా, కేంద్ర ప్రభుత్వం 70 శాతం న్దిహులు ఇచ్చిందని, రాష్ట్ర వాట నామమాత్రం అని బీజేపీ నేతలు చెప్తున్నారు. కేంద్రం డబ్బులు ఇస్తే, అదేదో కుటుంబ వ్యవహారం అన్నట్టు, వైఎస్ఆర్ బొమ్మ కూడా వేసుకున్నారని, కేంద్ర ఇచ్చిన డబ్బులతో కొన్న అంబులెన్స్ ల పై, ప్రధాని బొమ్మ వెయ్యాలని, బీజేపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.