ఈ రోజు విజయసాయి రెడ్డితో పాటుగా, ఆ పార్టీ ఎంపీలు, ఢిల్లీ వెళ్ళిన సంగతి తెలిసిందే. స్పెషల్ ఫ్లైట్ వేసుకుని, మరీ ఢిల్లీ వెళ్ళింది, ఏపి సమస్య పై కాదు, పార్టీ అంతర్గత విషయాల పై స్పెషల్ ఫ్లైట్ వేసుకుని మరీ ఢిల్లీ వెళ్లారు. మరి ఆ ఖర్చు పార్టీ ఖాతాలో వేస్తారో, ప్రభుత్వం ఖాతాలో వేస్తారో చూడాలి. వీళ్ళు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఢిల్లీ వెళ్ళింది, తమ సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు పై అనర్హత వేటు వెయ్యాలని కోరుతూ, వాళ్ళు ఢిల్లీ వెళ్ళారు. ఈ రోజు మూడు గంటల ప్రాంతంలో, లోక్ సభ స్పీకర్ ను కలిసి, రఘురామకృష్ణం రాజు పై అనర్హత వేటు వెయ్యాల్సిందిగా కోరారు. దానికి సంబందించిన ఫిర్యాదు చేసిన తరువాత, ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో, రఘురామకృష్ణం రాజు పై విజయసాయి రెడ్డి విరుచుకు పడ్డారు. విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, రఘురామకృష్ణం రాజు పై కేసులు ఉన్నాయని, వాటి నుంచి కాపాడుకోవటానికి ఒక పార్టీకి దగ్గర అవుతున్నారని అన్నారు. రఘురామ కృష్ణం రాజు, మా జగన్ నాయకత్వాన్ని "ఎవరి నాయకత్వం అయ్యా, బొచ్చులో నాయకత్వం" అంటూ, జగన్ ని నిందించారని అన్నారు. అలాగే అనేక విషయాల్లో, పార్టీ లైన్ దాటి ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారని ఆరోపించారు. ఇవన్నీ చూసిన తరువాత, ఆయన పదవిని అనర్హుడిగా ప్రకటించాలని కోరామని అన్నారు.
అయితే ఈ సందర్భంలో, విజయసాయి రెడ్డికి, కొన్ని ఇబ్బందికర ప్రశ్నలు ఎదురు అయ్యాయి. రఘురామ రాజు అనర్హత పిటీషన్ వెయ్యాలని, చెప్పే మీరు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీని తిడుతూ, మీ పార్టీకి దగ్గరగా ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పటికే అనర్హత పిటీషన్లు ఇచ్చారు కదా, రఘురామకృష్ణం రాజుకి వర్తించే రూల్స్, వీరికి వర్తించవా ? అని విలేఖరి ప్రశ్నించగా, విజయసాయి రెడ్డి ఇబ్బంది పడ్డారు. ఆ ముగ్గురు ఎవరో తనకు తెలియదు అని, మీకు ఈ విషయంలో ఏమన్నా కావలి అంటే, ఆ పార్టీని అడగండి అంటూ, అసహనం వ్యక్తం చేసారు. రెండో సారి మళ్ళీ అడగగా, జవాబు చెప్పటానికి ఇష్టపడలేదు. ఇక రఘురామరాజు లేవనెత్తిన, క్రమశిక్షణ సంఘం విషయం ప్రస్తావించగా, అది మా పార్టీ అంతర్గత విషయం అని, అన్నీ పార్టీలో ఉన్నాయని, అన్నీ రూల్స్ ప్రకారమే చేసాం అని, అవన్నీ బయటకు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ, క్రమశిక్షణ సంఘం గురించి చెప్పకుండా, తప్పించుకునే సమాధనం చెప్పారు. మరి రఘురామరాజుకు వర్తించే అనర్హత, ఇక్కడ ఉన్న ముగ్గురు రెబల్స్ కు వర్తించవా ?