భారత రాష్ట్రపతి సంచలన నిర్ణయం తీసుకున్నారు తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో దళిత యువకుడు ప్రసాద్ కు, పోలీస్ స్టేషన్ లోనే శిరోముండనం చేసిన విషయం పై స్పందించిన రాష్ట్రపతి రాం నాద్ కొవింద్, ఈ విషయం పై చాలా సీరియస్ గా ఉన్నారు. సహజంగా రాష్ట్రపతి , గవర్నర్ లు నేరుగా కల్పించుకోరు. ఏదైనా అసాధారణ కేసు తప్పితే, ఏ విషయమైనా ప్రభుత్వాలకు రిఫర్ చేస్తారు. అయితే సీతానగరం ఘటనలో మాత్రం రాష్ట్రపతి జోక్యం చేసుకుని, ఆయనే ఆదేశాలు ఇవ్వటం సంచలనం అనే చెప్పాలి. ఆ ఘటన జరిగిన తీరు ఎలాంటిదో అర్ధం అవుతుంది. ఇసుక లారీలు ఆపినందుకు, స్థానిక నేతలు, ప్రసాద్ అనే దళితుడిని, పోలేస్ స్టేషన్ లోనే గుండు కొట్టించటం అప్పట్లో సంచలనంగా మారింది. అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావటంతో, డీజీపీ కొంత మందిన సస్పెండ్ చేసారు. అయితే, అసలు వాళ్ళని వదిలిపెట్టారని, తనకు న్యాయం చెయ్యాలి అంటూ, ప్రసాద్ ఆందోళన చేసారు. ప్రభుత్వం స్పందించక పోవటంతో, రాష్ట్రపతికి లేఖ రాసారు.
తనకు అన్యాయం జరిగిందని, న్యాయం జరుగుతుంది అనే నమ్మకం లేదని, తానే న్యాయం చేసుకుంటాను అని, నక్సల్స్ లో చేరేందుకు పర్మిషన్ అడుగుతూ లేఖ రాసారు. దీని పై ఇప్పటికే రాష్ట్రపతి స్పందించి, రాష్ట్ర జీఏడీ సహాయ కార్యదర్శి జనార్దన్ బాబును, ఈ కేసు పై దర్యాప్తు చేసి చెప్పమన్నారు. అయితే ఆయన వద్దకు వెళ్ళినా స్పందన లేదు అని ప్రసాద్ తెలపటంతో, రాష్ట్రపతి ఈ ఫైల్ ను సామాజిక న్యాయశాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వటమే కాకుండా, ఈ కేసుని అత్యవసర కేసుగా భావించి, వెంటనే పూర్తీ విచారణ జరిపి, తనకు నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. రాష్ట్రపతి కార్యదర్శి అశోక్ కుమార్, దీనికి సంబదించిన ఆదేశాలు ఇచ్చారు. ఈ కీలక పరిణామంతో, ఏమి జరుగుతుందా అనే ఆసక్తి నెలకొంది. సహజంగా ఇలాంటి కేసుల పై రాష్ట్రపతి, ప్రభుత్వాలకు ఫార్వర్డ్ చేసి, వారినే చూడమంటారు. ఇక్కడ రాష్ట్రపతి కలుగ చేసుకుని, ఆయనే విచారణఅధికారిని నియమించటం సంచలంగా మారింది.