ఆంధ్రప్రదేశ్ లో ప్రతి రోజు ఏదో ఒక రాజ్యాంగా ఉల్లంఘన కేసులతోనే గడిచిపోతుంది. మొన్నటి వరకు ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు, ఏకంగా ఎన్నికల కమీషనర్ ని తప్పించటం, మాస్కు అడిగిన డాక్టర్ పై వేధింపులు, ఇలా ప్రతి రోజు ఏదో ఒక కేసుతో కోర్టుల్లో నానుతూ వచ్చాయి. ఇప్పుడు గత నెల రోజులుగా రాజధాని అమరావతి చుట్టూ, కోర్టులలో కేసులు నడుస్తున్నాయి. తాజాగా సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకారణ బిల్లు పై, హైకోర్టులో రైతులు కేసు వెయ్యటం, ఆ కేసు పై, ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు అంటూ, హైకోర్టు స్టేటస్ కో విధించిన సంగతి తెలిసిందే. ముందుగా పది రోజులు కేసు వాయిదా వేసిన హైకోర్టు, మళ్ళీ 27 వరకు వాయిదా వేసింది. అయితే హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో రద్దు చెయ్యాలి అంటూ, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అత్యవసర పిటీషన్ వేసింది. అయితే, ప్రభుత్వం వేసిన పిటీషన్ లో తప్పులు ఉండటంతో, పిటీషన్ ను కోర్టు తిప్పి పంపించింది. మళ్ళీ సవరించి సుప్రీం కోర్టు ముందు మళ్ళీ ఫైల్ చేసారు.

అయితే మొన్న సోమవారం సుప్రీం కోర్టు ముందుకు వచ్చింది. చీఫ్ జస్టిస్ బెంచ్ ముందుకు వచ్చింది. అయితే సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కూతురు, అమరావతి రైతుల తరుపున హైకోర్టులో వాదించారు అని తెలియటంతో, సిజీ ఈ కేసు నుంచి తప్పుకుని వేరే బెంచ్ కు ట్రాన్స్ఫర్ చేసారు. వేరే బెంచ్ కు వచ్చిన ఈ కేసు, ఈ రోజు విచారణకు వచ్చింది. జస్టిస్ రోహింటం నారిమాన్ ఉన్న త్రిసభ్య ధర్మాసనం బెంచ్ ముందుకు ఈ కేసు వచ్చింది. అయితే అనూహ్యంగా ఈ జడ్జి నారిమాన్ కూడా నాట్ బిఫోర్ అంటూ, కేసు నుంచి తప్పుకుని, వేరే బెంచ్ కు ట్రాన్స్ఫర్ చేసారు. జస్టిస్ రోహింటం నారిమాన్ తండ్రి అమరావతి రైతుల తరుపున వాదనలకు నియమించుకోవటంతో, జస్టిస్ నారిమాన్ నాట్ బిఫోర్ మీ అంటూ కేసు నుంచి తప్పుకుని, వేరే బెంచ్ కు ట్రాన్స్ఫర్ చేసారు. మొత్తానికి అనేక మలుపులు తిరుగుతున్న ఈ కేసు, మరో బెంచ్ ముందు ఎప్పుడు వస్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read