కారు దగ్ధం వీడియో ఇక్కడ చూడవచ్చు - https://youtu.be/sXByFiiN9R8 . విజయవాడలో దారుణం జరిగింది. కారులో మనుషులను పెట్టి మంటలు అందించాడు ఒక వ్యక్తీ. వేణుగోపాల్‌రెడ్డి అనే వ్యక్తి హత్యకు ప్లాన్ చేసాడు. ల్యాండ్ వ్యవహారం వివాదంలో, ఈ మర్డర్ ప్లాన్ జరిగింది. నలుగురు వ్యక్తులను ప్రీ ప్లాన్డ్ గా నోవోటెల్ వద్దకు తీసుకోవచ్చాడు నిందితుడు. కారులో వచ్చిన నలుగురు పై పెట్రోల్ పోసి హత్యాయత్నం చేసాడు. కారు పూర్తిగా దగ్ధం అయ్యింది. ఆ మంటలకు ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మిగిలిన వారు తప్పించుకున్నారు. గాయాలు అయిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఈ కేసు పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని కృష్ణా రెడ్డిగా గుర్తించారు. అతనికి ఒక ప్రైవేటు హాస్పిటల్ లో వైద్యం జరుగుతుంది. ఈ ఘటన పై ఏసిపీ మాట్లాడుతూ ఘటన వివరాలు తెలిపారు. నలుగురు ఫ్రెండ్స్ అని, ఇది ఏదో అనుకోకుండా జరిగింది కాదని అన్నారు. మొత్తం ప్లాన్ ప్రకారం చేసారని తెలిపారు. చాల కాలం నుంచి నలుగురు కలిసి వ్యాపారాలు చేస్తున్నారని అన్నారు.
రియల్ ఎస్టేట్ తో పాటు, కారులు కొనటం అమ్మటం లాంటివి చేసారని, అయితే వ్యాపారంలో వీరికి ఎప్పుడు నష్టాలు వస్తు ఉండేవని అన్నారు. ఈ విషయం పైనే, ఈ నష్టాలు ఎవరు ఎంత భరించాలి అనే దాని పై గత కొంత కాలంగా నలుగురు మధ్య చర్చలు జరుగుతున్నాయని ఏసిపి తెలిపారు. ఆ సందర్భంగానే, నోవోటెల్ కు వెళ్లి మాట్లడకుందాం, మా ఫ్రెండ్ వస్తాడు అంటూ, ఇక్కడకు రప్పించినట్టు చెప్పారు. ఈ సందర్భంలో ఏమి జరిగింది అనేదాని పై విచారణ చేస్తున్నామని, ఏమి జరిగింది అనే దాని పై త్వరలోనే చెప్తాం అని అన్నారు. పరారీలో ఉన్న వేణుగోపాల రెడ్డి ని పట్టుకుంటానికి చేస్తున్నామని అన్నారు. త్వరలోనే విచారణకు సంబంధించి మొత్తం వివరాలు చెప్తాం అని అన్నారు. కారు దగ్ధం వీడియో ఇక్కడ చూడవచ్చు - https://youtu.be/sXByFiiN9R8