ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు తమ పై వ్యవహరిస్తున్న తీరు పై, టీవీ చైర్మెన్, అలాగే ఎడిటర్ మూర్తి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మెట్లు ఎక్కారు. అక్కడ వారికి రిలీఫ్ లభించింది. కేసు వివరాల్లోకి వెళ్తే, యూనివర్సిటీల నియామకాల్లో ఒకే కులానికి ప్రాధాన్యత ఇచ్చారు అంటూ, ఒక నోట్ ఫైల్ బయట పెట్టి, మూర్తి వివరాలు బయట పెట్టారు. అయితే, ఆ నోట్ ఫైల్ దొంగాలించారు అంటూ, టీవీ5 పై సిఐడి కేసు నమోదు అయ్యింది. అయితే దీని పై హైకోర్టుకు వెళ్ళిన మూర్తి, ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. దీంతో అరెస్ట్ చెయ్యకుండా నిరోధించకలిగారు. అయితే విచారణకు పిలిచినప్పుడు వెళ్ళాలి అని చెప్పారు. అయితే తమను పోలీసులు మాటిమాటికి గుంటూరు పిలిస్తున్నారని, గంటలు గంటలు వెయిట్ చేపించి, విచారణ కొంచెం సేపు చేసి పంపిస్తున్నారని, తమ పనులు అన్నీ పక్కన పెట్టుకుని రావాల్సి వస్తుందని మూర్తి అనేక సార్లు ఆరోపించారు. ఇదే విషయం పై ఆయన హైకోర్టుకు వెళ్ళటంతో, విచారణ కోసం అక్కడ వరకు అవసరం లేదని, ఏదైనా కావాలి అంటే వీడియో కాన్ఫరెన్స్ లో విచారణకు హాజరు కావచ్చు అంటూ, మూర్తి, టీవీ5 చైర్మెన్ కు కోర్టు రిలీఫ్ ఇచ్చింది.
ఈ పరిణామం పై టీవీ5 మూర్తి ఒక వీడియో మెసేజ్ వదిలారు.... "ప్రజల పక్షాన నిలుస్తున్న టీవీ5 గొంతు నిలిమేద్దామని, తమ పై చేసిన ప్రయత్నాలకు హైకోర్టు అడ్డుకట్ట వేసింది. మా మీద పెట్టిన తప్పుడు కేసులు నుంచి, మాకు రిలీఫ్ ఇచ్చింది. ఇంతకు ముందు మాకు అంటిసిపేటరీ బెయిల్ ఇచ్చినా, అయినప్పటికీ తమను గుంటూరు పిలిచి, గంటలు గంటలు విచారణ పేరుతో తమను ఇబ్బంది పెట్టారు. ఇక పై మమ్మల్ని పిలవద్దు అని, నన్ను, మా చైర్మెన్ గారిని, ఇక పై గుంటూరు విచారణ పిలవద్దు అని హైకోర్టు, ఈ రోజు ఉత్తర్వులు ఇచ్చింది. మా తరుపున మా కౌన్సిల్ జంధ్యాల రవిశంకర్ గారికి, థాంక్స్ చెప్తున్నాం. ఈ సమయంలో మా వెన్నంట ఉన్న శ్రేయోభిలాషులు అందరికీ థాంక్స్ చెప్తున్నాం. మాతో పాటు నిలచిన లాయర్ ఉమేష్ చంద్రకు కూడా థాంక్స్ చెప్తున్నా" అని మూర్తి అన్నారు.