గత 16 నెలలుగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అరాచకాలు చేస్తుంది అంటూ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ కు అనేక లేఖలు రాసారు. అయితే 99 శాతం, ఆ లేఖల పై ఎలాంటి చర్యలు లేవు, లేదా చంద్రబాబుకి తిరిగి ఉత్తరం రాయటం లేదు. కొన్ని సందర్భాల్లో చంద్రబాబు రాసిన లేఖలను ప్రెస్ ముందు ప్రస్తావించారు డీజీపీ. అయితే మొదటి సారి డీజీపీ, చంద్రబాబు రాసిన లేఖకు రియాక్ట్ అయ్యారు. అయితే, ఇది చంద్రబాబు డీజీపీకి రాసిన లేఖ కాదు, ప్రధానికి రాసిన లేఖ. ఫోన్ ట్యాపింగ్ గురించి చంద్రబాబు, ప్రధానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై స్పందించిన డీజీపీ చంద్రబాబుకు లేఖ రాసారు. మీరు ప్రధానికి రాసిన లేఖ మీడియా ద్వారా మా దృష్టికి వచ్చింది, మీరు ప్రధానికి రాసిన లేఖ విషయానికి సంబంధించి, తమకు మీదగ్గర ఉన్న సాక్ష్యాలు ఇవ్వాలి అంటూ డీజీపీ లేఖలో తెలిపారు. రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం, అందరి హక్కులు కాపాడతామని డీజీపీ తెలిపారు.

అయితే ఈ విషయం పై తెలుగుదేశం పార్టీ నేతలు స్పందిస్తూ, ఆరోపణలు వస్తుందే మీ మీద అని, అందుకే అత్యున్నత విచారణ కోరుతున్నామని, మీకు సాక్ష్యాలు ఎలా ఇస్తాం అని ప్రశ్నించారు. అలాగే డీజీపీ రాసిన లేఖ పై చంద్రబాబు కూడా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ విషయం పై నేను ప్రధానికి లేఖ రాస్తే, దానికి డీజీపీ హడావిడిగా స్పందించటం విచిత్రంగా ఉంది. మీ మీద ప్రధానికి లేఖ రాస్తే, ఆధారాలు మీకు ఇవ్వాలి అని అడగటం విడ్డురంగా ఉందని చంద్రబాబు అన్నారు. గతంలో ఎన్నో లేఖలు ఆయనకు రాస్తే, దానికి స్పందన లేదని అన్నారు. ఆయన విచారణ చెయ్యకుండా, నన్ను ఆధారాలు ఇవ్వమని అడగటం ఏమిటి అని ప్రశ్నించారు. నన్ను విశాఖలో అడ్డుకుంటే ఏమి చేసాడు ? ఆత్మకూరు వెళ్ళనివ్వకుండా ఎందుకు ఆపాడు ? కోర్టులో నిలబడి చట్టం చదివే పరిస్థితి తెచ్చుకుని, ఇప్పుడు సాక్ష్యాలు ఇవ్వమంతున్నారు అని మండి పడ్డారు. ఫోన్ ట్యాపింగ్ ముందు నుంచి వాళ్లకు ఉన్న అలవాటే అని, గతంలో సిబిఐ జేడీ లక్ష్మీనారయణ ఫోన్ కూడా ఇలాగె ట్యాప్ చేసారని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read