తండ్రి చంద్ర‌బాబులాగే త‌న‌యుడు లోకేష్ విజ‌న‌రీలోనూ నెంబ‌ర్ వ‌న్. సీబీఎన్ మాదిరిగానే దూర‌దృష్టితో లోకేష్ ఆరంభించిన ప‌థ‌కాలు స‌త్ఫ‌లితాలు ఇస్తున్నాయి. రాజ‌కీయ వ్యూహాల‌లోకి వ‌చ్చేస‌రికి చంద్ర‌బాబు నాన్చుడు దోర‌ణికి పూర్తిగా భిన్నం లోకేష్ అని తేలిపోయింది. త‌న‌పైనా ఎవ‌రైనా ఆరోప‌ణ‌లు చేస్తే, ఏళ్లుగా వారి ఆరోప‌ణ‌లు భ‌రిస్తారే కానీ..నిజం ఇద‌ని చంద్ర‌బాబు చెప్ప‌రు. ఇదే ఆయ‌న‌కి పెద్ద న‌ష్టం చేకూర్చే అంశం. బాబాయ్‌ని చంపేసి చంద్ర‌బాబు మీద నెపం నెట్టేసి ``నారాసుర ర‌క్త‌చ‌రిత్ర‌`` అని రాస్తే సీబీఐ బాబాయ్ ని వేసేసింది ఇంటి గొడ్డ‌లే..వేసింది బిడ్డ‌లే అని ప్ర‌క‌టించేవ‌ర‌కూ సీబీఎన్ స్పందించ‌లేదు. లోకేష్‌కి చంద్రబాబు గారి లాగా సాగదీయటాలు, మొహమాటాలు లేవు.. ఉన్నది ఉన్నట్టు చెప్పేయటమే లోకేష్ స్టైల్. చంద్ర‌బాబు ఎన్నిక‌ల తేదీలు ప్ర‌క‌టించి నామినేష‌న్ గ‌డువు ద‌గ్గ‌ర ప‌డుతున్న‌ప్పుడు అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టిస్తారు. మొహ‌మాటం, సీటు లేదంటే బాధ‌ప‌డ‌తారోన‌నే ఆలోచ‌న‌లో బాబు తేల్చ‌రు, ముంచ‌రు. త‌న‌యుడు లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో తండ్రి చంద్ర‌బాబుకి భిన్న‌మైన తీరుతో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ప్ర‌త్య‌ర్థుల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డంలోనూ, టిడిపిపై చేసే ఆరోప‌ణ‌లు తిప్పికొట్ట‌డంలోనూ స్పాంటేనియ‌స్‌గా రియాక్ట‌వుతున్నారు. ధ‌ర్మ‌వ‌రంలో టిడిపి నుంచి అభ్య‌ర్థి ఎవ‌రు అనే డైల‌మాకి ఒక్క డైలాగ్ తో క్లారిటీ ఇచ్చేశారు. ప‌రిటాల శ్రీరామ్ వ‌స్తున్నాడు ఆశీర్వ‌దించండి అని స‌భికుల హ‌ర్ష‌ధ్వానాల మ‌ధ్య ప్ర‌క‌టించారు. పెనుగొండలో మాత్రం అభ్య‌ర్థి విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రించి త‌న రాజ‌కీయ ప‌రిణ‌తిని చాటారు. సీనియ‌ర్ నేత‌లు పార్ధసారధితో పాటు, సవితమ్మకు కూడా స‌మ ప్రాధాన్యం ఇచ్చిన లోకేష్‌.. ఇక్క‌డి సీటు విష‌యం మాత్రం ఎటువంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read