టిడిపి జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు అధికారంలో ఉన్నా, ప్ర‌తిప‌క్షంలో ఉన్నా అన్ని బాధ్య‌త‌లు ఆయ‌నే చూసుకుంటారు. 2014 అధికారంలోకి వ‌చ్చాక న‌వ్యాంధ్ర అభివృద్ధి త‌ప్పించి, పార్టీని కూడా ప‌ట్టించుకునే తీరిక లేనంత‌గా బాబు గ‌డిపారు. త‌న‌యుడు లోకేష్ కూడా మంత్రిగా ఉండ‌డంతో ప్ర‌భుత్వం-ప్ర‌జ‌లు-అభివృద్ధి అన్న‌ట్టుగా సాగింది టిడిపి స‌ర్కారు తీరు. స‌మీక్ష అయినా, పార్టీ కార్య‌క్ర‌మం అయినా, ప్ర‌తిప‌క్ష బాధ్య‌త అయినా అంతా చంద్ర‌బాబు చుట్టూనే తిరిగేది. ఇది నిన్న మొన్నటి వరకు పార్టీలో అన్ని బాధ్యతలు బాబువే.. కానీ ఇప్పుడు లోకేష్ ప్రజల్లో ఉన్నాడు, పిచ్చ క్రేజ్ వచ్చింది, అర‌వై రోజులు దాటిపోయినా పాద‌యాత్ర‌కి మ‌రింత స్పంద‌న పెరుగుతుందే త‌ప్పించి త‌ర‌గ‌డంలేదు. యువ‌నేత‌గా నారా లోకేష్ జ‌నాక‌ర్ష‌ణ శ‌క్తిగా మారారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వెంట ప్ర‌జ‌లు వ‌స్తున్నారు. చంద్ర‌బాబు ప్ర‌జ‌ల మ‌ధ్య తిర‌గాల్సిన అవ‌స‌రం లేదు. ఎప్పుడైతే ప్రజాక‌ర్ష‌క నేత‌గా లోకేష్ మారారో, చంద్ర‌బాబు రాజ‌కీయ వ్యూహాల‌కు ప‌దును పెట్ట‌డం ఆరంభించారు. పార్టీ మీద ఫోకస్ పెట్టారు. రాజకీయం మొదలు పెట్టారు. దాని ఫలితమే ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు. అంతేకాదు జిల్లాల వారీ సమీక్షలు, బలా బలాల బేరీజు, ఇతర పార్టీలతో సంప్రదింపులు, పార్టీ మంచి చెడు, ఇలా చంద్రబాబు చాణ‌క్యానికి చాలా స‌మ‌యాన్ని ఇచ్చాడు లోకేష్‌. దాదాపు ఏడాది పాటు లోకేష్ జ‌నాల మ‌ధ్య‌నే ఉంటారు. ఈ స‌మ‌యంలో చంద్ర‌బాబు పార్టీ బ‌లోపేతం, పొత్తులు, అభ్య‌ర్థుల ఎంపిక వంటి కీల‌క కార్య‌క్ర‌మాల‌న్నీ అంతా తానై చ‌క్క‌బెట్టేస్తున్నారు. ప్ర‌జ‌ల్ని చైత‌న్యం చేసి అరాచ‌క వైసీపీ పోరాడేందుకు స‌మాయాత్తం చేసే బాధ్య‌త‌ని బాబు నుంచి లోకేష్ తీసుకోవ‌డంతో చంద్ర‌బాబుకి ఎంతో స‌మ‌యం చేత‌చిక్కింది. ఈ స‌మ‌యాన్నే ఎన్నిక‌ల వ్యూహాలు ర‌చించేందుకు బాబు వినియోగిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read