ఇటీవ‌లే హార్ట్ ఎటాక్ వ‌చ్చి ఆస్ప‌త్రిలో చేరారు వెంక‌ట‌గిరి వైసీపీ ఎమ్మెల్యే మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి. స్టంట్ వేసి వైద్యం చేశారు. వ‌స్తూనే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క్రాస్ ఓటింగ్‌కి పాల్ప‌డ్డార‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. పార్టీ నుంచి కూడా స‌స్పెండ్ చేశారు. అయినా మేక‌పాటి ఇంచు కూడా త‌గ్గ‌డంలేదు. నియోజ‌క‌వ‌ర్గానికి రావొద్ద‌ని పోలీసుల‌తో వైసీపీ నేత‌లు హెచ్చ‌రిక‌లు పంపారు. తాను ఎమ్మెల్యేన‌ని ఎవ‌డు అడ్డుతాడో చూద్దామంటూ తొడ‌కొట్టి మ‌రీ నియోజ‌క‌వ‌ర్గంలో దిగారు. వైసీపీ నేత‌ల హెచ్చ‌రిక‌లు, పోలీసుల వార్నింగులు ప‌ట్టించుకోని ఉదయగిరి ఎమ్మెల్యే మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ఉదయగిరి బస్టాండ్ సెంటర్‍లో కుర్చీ వేసుకుని కూర్చున్నారు. ద‌మ్మున్నోడు వ‌చ్చి త‌న‌ను ట‌చ్ చేయాలంటూ మేకపాటి స‌వాల్ విసిరారు. మేకపాటి ఉదయగిరికి వస్తే తరిమికొడతామని ఇటీవల వైసీపీ నేత చేజర్ల సుబ్బారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. దీంతో బస్టాండ్ సెంటర్‍లో కుర్చీ వేసుకుని మ‌రీ ఎమ్మెల్యే కూర్చున్నారు. గంటన్నర పాటు బస్టాండ్ సెంటర్‍లోనే కూర్చుని వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎవరు పడితే వారు నాయకులు కాలేరని మేకపాటి ఎద్దేవ చేశారు. ఎమ్మెల్యే మేకపాటికి వ్యతిరేకంగా వైసీపీ నేతలు ఆందోళ‌న‌కి దిగారు. తాము వచ్చే సరికి మేకపాటి వెళ్లిపోయారన్న వ్యతిరేక వర్గం అంటుంటే, ఇప్ప‌టివ‌ర‌కూ అక్క‌డే ఉంటే ఎందుకు రాలేదంటూ మేక‌పాటి అంటున్నారు. టెన్షన్ వాతావ‌ర‌ణం నెల‌కొన‌డంతో పోలీసులు ఉరుకుల ప‌రుగులు పెట్టారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read