వైసీపీ అంటేనే ఐ ప్యాక్. ఇండియన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ షార్ట్ క‌ట్‌లో ఐ ప్యాక్ వైసీపీ అధిష్టానం లెక్క‌. రోడ్ల‌న్నీ గుంత‌లు ప‌డి ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతుంటే, ఐప్యాక్ సెలెక్ట్ చేసిన రోడ్లే వేయాలంటూ అధికారుల‌కు ఆదేశాలిచ్చారు జ‌గ‌న్ రెడ్డి. వైసీపీ స‌మీక్ష‌లు, స‌మావేశాలు, టికెట్ల ఎంపిక‌లు, త‌ప్పించ‌డాల‌న్నీ ఐప్యాక్ స‌ర్వేల ఆధారంగానే చేస్తుంటారు. ముఖ్య‌మంత్రికి క‌ళ్లూ, చెవుల్లా మారిన ఐ ప్యాక్ అంతా త‌మ గుప్పెట్లోకి తెచ్చుకుంది. ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ఉన్న త‌న‌ని ముఖ్యమంత్రిని చేసింది ఐప్యాక్ అనే న‌మ్ముతున్న జగన్మోహన్‌రెడ్డి, ఆ స‌ర్వే సంస్థ ఏమి చెబితే అదే వేదంగా భావిస్తూ వ‌స్తున్నారు. ఇప్ప‌టికీ ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఐప్యాక్ మూడు ర‌కాల స‌ర్వేలు చేస్తూ నివేదిక‌లు వైసీపీ పెద్ద‌ల‌కు అంద‌జేస్తూనే ఉంది. మంత్రుల చుట్టూ ఉండేది కూడా ఐప్యాక్ మ‌నుషులే. సీఎం కూడా పార్టీ నేత‌ల‌కంటే ఎక్కువ‌గా ఐప్యాక్ టీముని న‌మ్ముతుండ‌డంతో అంద‌రూ ఐ ప్యాక్ వారిని ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో ఉన్నారు. దీన్ని ఆస‌రాగా తీసుకున్న ఐ ప్యాక్ టీము త‌మ‌కి చేయి త‌డిపిన వారికి అనుకూలంగా నివేదిక‌లు ఇస్తున్నార‌ని వైసీపీకి మ‌ద్ద‌తుగా నిలిచే ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక‌లో ప్ర‌త్యేక క‌థ‌నం ప్ర‌చురితం అయ్యింది. బాగా ప‌నిచేస్తున్న ఎమ్మెల్యేలు ఐ ప్యాక్ వారికి తృణ‌మో, ప‌ణ‌మో ఇవ్వ‌క‌పోతే వారికి వ్య‌తిరేకంగా నివేదిక‌లు ఇస్తున్నార‌ని పార్టీలో ఆందోళ‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. నేత‌లంతా ఐ ప్యాక్ బాధితులే. కానీ ఎవ్వ‌రూ సీఎం జ‌గ‌న్ రెడ్డికి ఈ విష‌యాన్ని చెప్ప‌లేరు. ఆయ‌న దృష్టికి వెళ్లాల‌నే వైసీపీలో కీల‌క నేత‌లు త‌మ చెప్పుచేత‌ల్లో ఆ ప‌త్రిక‌లో ఐ-ప్యాక్ ప్యాకేజీ పాలిటిక్స్‌పై ప్ర‌త్యేక క‌థ‌నం వేయించార‌ని స‌మాచారం బ‌య‌ట‌కి పొక్కింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read