జ‌మ్మ‌ల‌మ‌డుగులో నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర జ‌న‌సంద్రాన్ని త‌ల‌పించింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. జ‌మ్మ‌ల‌మ‌డుగు అంటే వైఎస్ జ‌గ‌న్ రెడ్డి అడ్డా. టిడిపిలోకి వ‌చ్చిన ఆదినారాయ‌ణ‌రెడ్డి ఇప్పుడు లేరు. టిడిపిలో చాలా ఏళ్లుగా ఉంటూ వ‌చ్చిన రామ‌సుబ్బారెడ్డి ఇప్పుడు వైసీపీ నేత‌. జ‌మ్మ‌మ‌డుగులో సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ. ఎటుచూసినా ఇక్క‌డ టిడిపికి పెద్ద దిక్కులేదు. టిడిపిలో చేరింది ఓ యువ‌నేత మాత్ర‌మే. వైసీపీలో మ‌ద‌మెక్కిన అధికారం. ధీటుగా ఢీకొట్టే నేత‌లు బీజేపీ పంచ‌న ఉన్నారు. టిడిపికి ద‌శాబ్దాలుగా వెన్నంటి ఉన్న నేత వైసీపీలో చేరాడు. స‌రిగ్గా అటువంటి సంక్షోభ స‌మ‌యంలో, తెలుగుదేశం మాటే వినిపించ‌ని జ‌మ్మ‌ల‌మ‌డుగులో టిడిపి యువ‌నేత నారా లోకేష్ పాదయాత్ర జ‌న‌సునామీని త‌ల‌పించింది. జనసంద్రంగా మారిన జమ్మలమడుగులో ఎటుచూసినా జనమే. లోకేష్ ని చూసేందుకు వ‌చ్చిన జ‌నంతో కిలోమీట‌ర్ల మేర డ్రోన్ షూట్‌కి అంద‌నంత జ‌నం పోటెత్తారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న భవనాల పైకి ఎక్కి లోకేష్ కి అభివాదం చేశారు ప్రజలు. జ‌మ్మ‌ల‌మ‌డుగులో పాద‌యాత్ర విఫ‌లం అవ్వాల‌ని అధికార పార్టీ వేసిన ఎత్తులు చిత్త‌య్యాయి. కుర్రాడైనా, రాజ‌కీయాల‌కు కొత్త‌యిన దేవ‌గుడి భూపేష్ రెడ్డి కోఆర్డినేష‌న్ న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న చంద్రంగా ఉంది. బెదిరింపుల‌కి దేవ‌గుడి వార‌బ్బాయి భ‌య‌ప‌డ‌లేదు. అడ్డంకులు సృష్టిస్తే నారా సింహం వెన‌క‌డుగు వేయ‌లేదు. ఇక చివ‌రి అస్త్రంగా జమ్మలమడుగులో కరెంట్ తీసేయించారు. వీధిలైట్లు వెల‌గ‌కుండా జ‌నం రాకూడ‌ద‌ని, క‌న‌ప‌డ‌కూడ‌ద‌ని చేసిన ప్ర‌య‌త్నాలేవీ ఫ‌లించ‌లేదు. ప‌ల్లెల నుంచి జ‌నం స్వ‌చ్ఛందంగా త‌ర‌లివ‌చ్చారు. టిడిపి కేడ‌ర్ ఉర‌క‌లెత్తే ఉత్సాహంతో క‌దం తొక్కింది. టిడిపికి లీడ‌ర్, కేడ‌ర్‌లేని వైకాపా అడ్డాలో అశేష ప్ర‌జాస్పంద‌న, ప్ర‌భుత్వంపై వ్యతిరేకతే అని  రాజ‌కీయ ప‌రిశీల‌కులు విశ్లేషిస్తున్నారు. లోకేష్ చ‌రిష్మా, టిడిపి మినీ మేనిఫెస్టో కూడా జ‌మ్మ‌ల‌మ‌డుగు జ‌న‌సంద్రానికి ముఖ్య‌కారణాల‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read