ఏపీలో పొలిటికల్ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. నాలుగేళ్ల క్రితం ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత టిడిపి ఈ రేంజులో పుంజుకుంటుందని ఏ రాజకీయ పార్టీలు వూహించలేదు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా టిడిపి అధికారం చేపట్టడం ఖాయమనే సంకేతాలు, సర్వేలు వెలువడుతున్నాయి. టిడిపితో ఆల్రెడీ జనసేన పొత్తు కన్ ఫామ్ అయ్యింది. జనసేన బీజేపీ అలయెన్స్ ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రంలో బీజేపీ పెద్దలు వైసీపీతో రహస్యపొత్తు కొనసాగిస్తున్నారు. ఇంత గందరగోళమైన ఎత్తులు-పొత్తుల మధ్య ముందస్తు ముచ్చట్లు ఉండనే ఉన్నాయి. ఎన్డీఏ నుంచి బయటకొచ్చాక టిడిపి బీజేపీతో సంబంధాలకి ఆసక్తి చూపించినా, వారు వైసీపీతో ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. నిత్యమూ కేసులు, హత్యలు, అప్పుల కోసం తమ చుట్టూ తిరుగుతున్న జగన్ రెడ్డికి జనాదరణ తగ్గిపోయిందని కమలనాథులు కనిపెట్టేశారు. తెలంగాణలోనూ తమ అవసరానికి కోట్లు సాయం చేయగలడు కానీ, ఓట్లు తేలేని జగన్ రెడ్డిని దూరం పెట్టే యోచనలో కేంద్రంలోని బీజేపీ పెద్దలున్నారని విశ్వసనీయ సమాచారం. పీకల్లోతు కేసుల్లో కూరుకుపోయిన జగన్ రెడ్డికి తమ అవసరమే కానీ, తమకు జగన్ ఏ విధంగానూ ఉపయోగపడేలా లేడని వ్యూహం మార్చేశారు. దాదాపు ఆరేళ్లుగా ఎడమొఖం-పెడమొఖంగా ఉన్న చంద్రబాబు బీజేపీ పెద్దలతో తొలి భేటీ జరగబోతోంది. కేంద్రమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ పెను రాజకీయ మార్పులకు వేదిక కానుందని విశ్లేషణలు వస్తున్నాయి. ఏపీలో బీజేపీకి ఏమీ లేదనే సంగతి వారికీ తెలుసు. ఇక్కడ బీజేపీతో టైఅప్ అయితే టిడిపి ఓట్లతో వారికి సీట్లు తేవడం తప్పించి ఇంకే మేలూ జరగదు. బీజేపీ టిడిపి వైపు చూడడానికి అసలు సిసలు ఫాక్టర్ తెలంగాణ. కర్ణాటకలో బొక్కబోర్లాపడి దక్షిణాదిలో పవర్లో లేని బీజేపీగా మిగిలిపోయింది. పదేళ్ల కేసీఆర్ పాలనపై ఉన్న వ్యతిరేకతని క్యాష్ చేసుకుంటే, టిడిపి వంటి ఓటుబ్యాంకున్న పార్టీతో పొత్తు ఖరారైతే తెలంగాణలో కాషాయం జెండా ఎగురవేయొచ్చనే దిశగానే పొత్తుల వ్యూహం ఉండొచ్చని జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
ఏపీలో పొలిటికల్ ట్రెండ్ మారింది..బాబు వైపు మోదీషా చూపు
Advertisements