పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వ స్కాం ఒకటి బయట పెట్టారు. లోకేష్ దెబ్బకి ఎమ్మెల్యే శిల్పా బ్యాంక్ బెంబేలు ఎత్తిపోయింది. వర్ధన్ బ్యాంక్ ద్వారా శిల్పా కుటుంబం చేసిన ప్రజా ధనం లూటీని నారా లోకేష్ కర్నూల్ పాదయాత్రలో బయట పెట్టారు. బహిరంగ సభ వేదిక పైన బయట పెట్టారు. ముఖ్యంగా కర్నూల్ జిల్లాలో శ్రీశైలం, నంద్యాల నియోజకవర్గాల్లో పర్యటనలో భాగంగా శిల్పా కుటుంబం దోపిడీ గురించి పూర్తి ఆధారాలతో నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేసారు. ల్యాండ్, స్యాండ్, వైన్, మైన్ మాఫియా ద్వారా శిల్పా కుటుంబం దోపిడీ మొత్తాన్ని బయటకి తీసాడు లోకేష్. ఈ క్రమంలోనే వర్ధన్ బ్యాంక్ ద్వారానే రూ.100 కోట్లు దళితుల సొమ్ము కొట్టేసారని శిల్పా చక్రపాణ రెడ్డి, శిల్పా రవి పై లోకేష్ ఆరోపణలు హ్సుసారు. అంతే కాదు ఆధారాలు కూడా బయట పెట్టారు. లోకేష్ బయటపెట్టిన ఆధారాలతో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడి, ఫెమా, ఐటి, సిబిఐ అధికారులకు శిల్పా కుటుంబం అక్రమాల పై విచారణ జరపాలి అంటూ టిడిపి ఎంపీలు లేఖలు రాసారు. టిడిపి ఫిర్యాదు పై, ఐటి అధికారులు రంగంలోకి దిగారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read