తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ఎప్పుడూ కోపంగా మ‌న‌కి క‌నిపిస్తారు. మాట్లాడితే ఆగ్ర‌హంగా ఊగిపోతూ ఉంటారు. బేల మాట‌లుండ‌వు. నీ ప్ర‌తాప‌మో, నా ప్ర‌తాప‌మో తేల్చుకుందాం రా అనే టైపు. వంద‌ల కోట్ల వ్యాపారాల‌పై దాడులు చేయించి మూసేయించినా బెద‌ర‌లేదు. అక్ర‌మ‌కేసుల‌తో అరెస్టు చేసి జైలులో వేసినా లొంగ‌లేదు. ఏనాడూ ఒక్క క‌న్నీటి చుక్క కార్చ‌లేదు. తొలిసారిగా మీడియాతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యారు. తాడిప‌త్రిలో నారా లోకేష్ పాద‌యాత్ర విజ‌య‌వంతంగా ముగిసిన అనంత‌రం జెసి ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పాదయాత్ర తరువాత లోకేష్ నీ చూస్తే బాధేసిందన్నారు. లోకేష్ పుట్టుకతోనే వజ్ర.. వైఢూర్యాలు చూసిన వ్యక్తి అని, అన్ని ఆస్తులు సంపాదించిన తాత పెంపకంలో పెరిగిన వ్యక్తి లోకేష్ అని కొనియాడారు. చిన్నప్పటి నుంచి లోకేష్ పెరిగిన విధానం దగ్గరుండి చూసిన వ్యక్తిగా లోకేష్ పాదయాత్ర లో పడుతున్న అవస్థలు చూసి బాధ పడుతున్నాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. లోకేష్ చేస్తున్న త్యాగం ప్రజల కోసమేన‌ని లోకేష్ ఒక కర్మజీవి అంటూ ప్ర‌శంసించారు. బంగారు స్పూనుతో పుట్టిన లోకేష్ ఎండ అంటే ఏంటో తెలియ‌కుండా పెరిగార‌ని, ఉన్న‌త చ‌దువులు చ‌దివార‌ని, అన్నీ వ‌దులుకుని ప్ర‌జ‌ల కోసం మండుటెండ‌ల్లో న‌డుస్తుండ‌డం చూస్తే హృద‌యం ద్ర‌వించిపోతోంద‌ని జేసీ క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షించేందుకు లోకేష్ చేస్తున్న పాదయాత్ర విజయవంతం అవుతోంద‌న్నారు. యావత్తు ఆంధ్ర ప్రదేశ్ పిల్లల భవిష్యత్ కోసం అని లోకేష్ చెప్పిన మాటలు ఉత్తేజ‌పూరితంగా ఉన్నాయ‌ని, లోకేష్ పిరికివాడు కాదు..తాత ఎన్టీఆర్ ఆశయాలను పుణికిపుచ్చుకున్నాడ‌ని కొనియాడారు. ఎన్ని ఇబ్బందులైనా ఓర్చుకుని ఇచ్ఛాపురం వరకు లోకేష్ నవ్వుతూనే పాదయాత్ర పూర్తి చేస్తాడ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడుతున్నారు.....నాయకులు మాత్రం భయంతో బతుకుతున్నార‌ని, త‌మ‌కి చెందిన అన్ని వ్యాపారాలు మూసేసినప్పటికి మేము భయపడటం లేద‌ని జేసీ చెప్పుకొచ్చారు. ప్రజల మద్దతు లోకేష్ కి వుందని,  టిడిపి నుంచి ఎవరు గెలవాలన్న చంద్రబాబు పోటో వుండాల్సిందేన‌ని ప్ర‌భాక‌ర్ రెడ్డి కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. జగన్ చేస్తున్న తప్పులు....లోకేష్ పాదయాత్ర తెలుగుదేశం అభ్య‌ర్థుల్ని  గెలిపిస్తుంద‌న్నారు. కార్యకర్తల కష్టాన్ని మర్చిపోవద్దు అంటూ నేతలకు హితవు చెప్పారు.

లోకేష్ సెల్ఫీ చాలెంజుల‌తో ఉక్కిరిబిక్కిరి అయిన అధికార వైసీపీ మౌనం దాల్చింది. తాజాగా ద‌ళితుల‌కి ఏం చేశావు జ‌గ‌న్ అంటూ స‌భ‌లో నిల‌దీస్తే, స‌మాధానం లేని వైసీపీ త‌మ‌దైన శైలిలో ఫేక్ చేసి కౌంట‌ర్ వ‌దిలింది. డోన్ నియోజ‌క‌వ‌ర్గం జక్కసానికుంట్లలో ఎస్సీ సామాజికవర్గం ప్రతినిధులతో ముఖాముఖి సమావేశంలో నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వైకాపా పాల‌న‌లో ద‌ళితుల‌పై సాగుతున్న ద‌మ‌న‌కాండ నుంచి ర‌క్షించాల‌ని టిడిపి యువ‌నేత‌ని ద‌ళితులు వేడుకున్నారు. దళితుల ఉన్నత విద్యకు ఉపయోగపడిన అంబేద్క‌ర్ విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ గారి పేరు తొలగించి, జ‌గ‌న్ రెడ్డి త‌న పేరు పెట్టుకున్నార‌ని, టిడిపి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే ద‌ళిత విద్యార్థుల‌కు ఉప‌యోగ‌ప‌డేలా మళ్లీ పథకం ప్రారంభించి అంబేద్కర్ గారి పేరు పెట్టాలని ద‌ళిత నేత కోరారు. ద‌ళితుల‌పై దాడులకి లైసెన్స్ ఇచ్చేసిన జ‌గ‌న్ రెడ్డి పాల‌న‌లో ద‌ళితుల సంక్షేమానికి పీకిందేమీ లేద‌ని, ద‌ళితుల బాగుకి పొడించిందేంట‌ని లోకేష్ ప్ర‌శ్నించారు. విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ పేరు తొలగించడం దుర్మార్గమ‌ని, టిడిపి అధికారంలోకి వచ్చిన జగన్ పేరు తొలగించి అంబేద్కర్ గారి పేరు పెట్టి విదేశీ విద్య పథకాన్ని ప‌క‌డ్బందీగా అమ‌లు చేస్తామ‌న్నారు. జ‌గ‌న్ రెడ్డి అక్ర‌మాస్తుల పెట్టుబ‌డుల విష‌పుత్రిక సాక్షి, వైకాపా పేటీఎం సోష‌ల్ మీడియా, వైసీపీ అధికారిక సోష‌ల్ మీడియాలో లోకేష్ మాట్లాడిన ఈ వీడియోని, అందులో ఆడియోని మార్ఫింగ్ చేసి శున‌కానందం పొందుతున్నారు. నా ఎస్సీలు అంటూ ప్ర‌సంగాల‌లో ప్రేమ ఒల‌క‌బోసిన జ‌గ‌న్ రెడ్డి నాలుగేళ్లు ద‌ళితుల‌పై ద‌మ‌న‌కాండ కొన‌సాగిస్తున్నార‌ని లోకేష్ ఆరోపించారు. సీఎంగా ద‌ళితుల‌కు ఏం పీకార‌ని లోకేష్ ప్ర‌శ్నిస్తే దానిని ద‌ళితులు ఏం పీకార‌ని మార్చ‌డం జ‌గ‌న్ రెడ్డి ద‌గ్గ‌ర ఉన్న మార్పింగ్ మాయ‌ల‌ప‌కీర్ల‌కే సాధ్యం. ఇక్క‌డ వీడియోని, ఆడియోని ఫేక్ చేసిన వైసీపీ గ్యాంగ్ ఒక్క విష‌యం మ‌రిచిపోయారు. టిడిపి వ‌స్తే జ‌గ‌న్ పేరు పీకేసి అంబేద్క‌ర్ పేరుపెట్టి విదేశీ విద్యాదీవెన అమ‌లు చేస్తామని ప్ర‌క‌టించేట‌ప్పుడు చ‌ప్ప‌ట్లు మారుమోగాయి. అవి మాత్రం జ‌గ‌న్ రెడ్డి మారీచులు మార్ఫ్ చేసిన వీడియోలో లేవు.అయితే ఇదే విషయం పై డోన్ సభలో, సాక్షి యజమాని వైఎస్ భారతికి లోకేష్ ఛాలెంజ్ చేసి, మీరు రాసిన రాతలకి ఆధారాలు బయట పెట్టాలని ఛాలెంజ్ చేసారు.

తెలంగాణ ప్ర‌భుత్వం అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా ఏపీలో వైసీపీ స‌ర్కారుని ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేస్తోంది. వాస్త‌వానికి వైసీపీతో టీఆర్ఎస్ కి మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే త‌మ‌ని తాము ప్ర‌మోట్ చేసుకునే క్ర‌మంలో ఏపీని చిన్న‌చూపు చూసినా వైసీపీ పాల‌కులు ఏమీ అన‌లేర‌నే ధీమాతోనే త‌ర‌చూ కేసీఆర్, కేటీఆర్, హ‌రీష్ రావు కూడా ఏపీలో ప‌రిస్థితుల‌పై ధ్వ‌జ‌మెత్తుతూనే ఉంటారు. తెలంగాణ పాల‌కులు త‌మ‌కి బోర్డ‌ర్‌లో ఉన్న క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర జోలికి మాత్రం వెళ్ల‌రు. ఈ రాష్ట్రాల వారి జోలికెలితే వారు ఒక రేంజులో కౌంట‌రిస్తారు. ఏపీలో అయితే తిట్టినా, కొట్టినా ప‌డి ఉంటార‌నే ధీమాతోనే తెలంగాణ పాల‌కులు త‌మ‌ని తాము గొప్ప‌గా చూపించుకునేందుకు ఏపీని అన్ని విష‌యాల్లో త‌క్కువ చేసి చూపుతుంటారు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ మేన‌ల్లుడు, ట్ర‌బుల్ షూట‌ర్ అయిన తెలంగాణ మంత్రి హరీష్ రావు ఏపీ ప్రభుత్వంపై అసక్తి కరమైన కామెంట్స్ చేసారు. ఆంధ్ర ,తెలంగాణలో పాలన చూస్తున్నారు క‌దా, ఏ రాష్ట్రంలో పాల‌న‌ బాగుందో మీరే ఆలోచించుకోండి అంటూ వ్యాఖ్యానించారు. ఏపీలో  రహదారులు ఎలా ఉన్నాయో ,అభివృద్ధి ఎలా ఉందో చూడండి...అంటూ ఏపీలో రోడ్ల ద‌య‌నీయ‌స్థితిని ఎత్తి చూపారు. కార్మికులు ఆంధ్రలో ఓటు రద్దు చేసుకొని తెలంగాణలో ఓటు హక్కు పొందితే..మీ బ‌తుకులు బాగుంటాయంటూ హ‌రీష్ రావు చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. దీనిపై ఏపీ నుంచి ఏ ఒక్క మంత్రీ స్పందించ‌క‌పోవ‌డం విచిత్రం.

ఎప్పుడూ కుల ప్ర‌స్తావ‌న‌లు చేయ‌ని టిడిపి ఇటీవ‌ల నోరు విప్పుతోంది. ప్ర‌శాంత్ కిశోర్ నేతృత్వంలో కుల‌,మ‌త‌, ప్రాంత విద్వేషాల విష‌వ్యూహాల‌ను దిగ్విజ‌యంగా అమ‌లు చేసిన వైకాపా అధికారం చేజిక్కించుకుంది. మ‌ళ్లీ అదే విష‌వ్యూహంతో 2024 ఎన్నిక‌ల‌కి స‌మాయ‌త్త మ‌వుతోంది. అప్పుడే విద్వేషాల‌కి బీజం వేస్తోంది. గ‌త‌సారి తెలుగుదేశం అవ‌లంభించిన మెత‌క వైఖ‌రితో జ‌రిగిన న‌ష్టాన్ని ఈ సారి జ‌ర‌గ‌నివ్వ‌మ‌ని తీర్మానించుకున్న‌ట్టున్నారు. టిడిపి అధిష్టానం కుల రాజ‌కీయాల ప‌ట్ల చాలా స్ప‌ష్టంగా ఉన్నారు. వైసీపీ కుల విద్వేషాలు ప్ర‌యోగించినా, జ‌నాల్ని చైత‌న్యం చేసి త‌మ స్టాండేంటో చాలా స్ప‌ష్టంగా చెబుతున్నారు టిడిపి అధినేత చంద్ర‌బాబు, లోకేష్‌. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో వివిధ సామాజిక‌వ‌ర్గాలు త‌న‌ని క‌లిసిన సంద‌ర్భంలో ప్ర‌తీ కులానికి టిడిపి చేసిన మేలు, వైసీపీ చేసిన కీడు వివ‌రిస్తున్నారు. తెలుగుదేశంపై వైసీపీ ప‌న్నిన విష‌వ్యూహాన్ని కుండ‌బ‌ద్దలుకొట్టారు. టిడిపి ప్ర‌భుత్వం 35 మంది క‌మ్మవాళ్ల‌కి డిఎస్పీలుగా ప్ర‌మోష‌న్ ఇచ్చింద‌ని చేసిన ప్రాప‌గాండా, మీ అంద‌రికీ తెలిసే ఉంటుంద‌ని వివ‌రించిన లోకేష్‌, ఇందులో నలుగురే క‌మ్మ‌వాళ్ల‌ని, అదీ వారి సీనియార్టీ ప్ర‌కారం వ‌చ్చిన ప్ర‌మోష‌న్ అని వైసీపీ ప్ర‌భుత్వ‌మే స‌భ‌లో వెల్ల‌డించింద‌ని ఇదీ టిడిపి పార‌ద‌ర్శ‌క‌త అని వివ‌రించారు. అలాగే జ‌గ‌న్ రెడ్డి వ‌ల్ల రెడ్ల‌కీ మేలు జ‌ర‌గ‌లేద‌ని, ఆయ‌న చుట్టూ ఉన్న న‌లుగురు రెడ్లు త‌ప్పించి అంద‌రినీ మోసం చేశార‌ని ఉదాహ‌ర‌ణ‌ల‌తో వివ‌రించారు. తెలుగుదేశంపైకి కులాల‌ని ఎగ‌దోసి వేడుక చూసిన జ‌గ‌న్ కి స‌రైన స‌మాధానం చెప్ప‌డానికే నిర్ణ‌యించుకున్న టిడిపి అధినేత‌లు స‌రైన కౌంట‌ర్లు ఇస్తున్నారు. ఏ కులానికి ఏం చేయాల‌నుకుంటున్నామో కూడా వివ‌రిస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read