చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు ఒక ఐఏఎస్ బాబు  పాల‌న‌లో కొత్త విధానాలు, క‌నిపించే పాల‌న‌, క‌నిపించ‌ని ప్ర‌భుత్వం, ఈ ప్ర‌గ‌తి, రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ వంటి మంచి ప్రాజెక్టుల అమ‌లుకి నేతృత్వం వ‌హించారు. వీటి ఫ‌లితాలు బాగుండ‌డంతో అతన్ని చంద్ర‌బాబు బాగా న‌మ్మారు. దీంతో ఆయ‌న త‌న బృందాలు, టీముల‌తో చంద్ర‌బాబు చుట్టూ చేరి...పార్టీ యంత్రాంగానికి, ప్ర‌జ‌ల‌కి దూరం అయ్యేలా చేశారు. అప్పుడు కూడా చంద్ర‌బాబు పాల‌న ప‌ట్ల‌ ప్ర‌జ‌లు చాలా సంతోషంగా ఉన్నార‌ని, 98 శాతం, 99 శాతం ఫీడ్ బ్యాక్ చూపించేవారు. 2019 ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌స్తే కానీ తెలియ‌లేదు ఆ సంతృప్తిశాతం అంతా బోగ‌స్ అని. ఇప్పుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా జ‌నం త‌న పాల‌న ప‌ట్ల బాగా సంతృప్తిగా ఉన్నార‌నే భ్ర‌మ‌లో ఉన్నారు. ఆ భ్ర‌మ‌ని నిజం చేసేలా ఐప్యాక్ రుషిరాజ్ సింగ్ జ‌గ‌న‌న్నే మా న‌మ్మ‌కం కార్య‌క్ర‌మానికి 2 కోట్ల మంది మిస్డ్ కాల్ ఇచ్చి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించార‌ని, ఈ ఓట్లు చాలు వైకాపాకి మ‌ళ్లీ అధికారం రావ‌డానికి అంటూ ఫీడ్ బ్యాక్ ఇచ్చేశారు. అంత‌టితో ఆగ‌కుండా వైకాపా ప్ర‌భుత్వం ప‌ట్ల ప్ర‌జ‌లు క‌న‌బ‌రిచిన విశ్వాసం విజ‌యానికి సూచిక అంటూ ఈ కార్య‌క్ర‌మంలో భాగ‌మైన మొత్తం ఐప్యాక్ బృందాల‌న్నింటికీ గ్రాండ్ పార్టీ ఇచ్చేశాడు. మొత్తానికి చంద్ర‌బాబు ఐఏఎస్ లు, క‌న్స‌ల్టెంట్ల‌ని న‌మ్ముకుని ప్ర‌జ‌ల‌కి పార్టీకి దూర‌మైతే...జ‌గ‌న్ రెడ్డి ఐప్యాక్-స‌ల‌హాదారుల్ని న‌మ్ముకుని పార్టీకి-ప్ర‌జ‌ల‌కి దూరం అవుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read