ఒక‌రిని విమ‌ర్శించామంటే మ‌నం చాలా క్లీన్‌గా ఉండాలి. ఒక‌రిపై ఆరోప‌ణ‌లు చేశామంటే, మ‌నపై ఎవ‌రూ ఏ ఆరోప‌ణా చేసే అంశాలు లేకుండా ఉండాలి. జ‌న‌సేన‌లో గెలిచి, వైకాపాలో క‌లిసిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్ చేసేవ‌న్నీ పిచ్చ ప‌నులు..చెప్పేవ‌న్నీ శ్రీరంగ నీతులు. నిత్య‌మూ పేకాట ఆడుతూ పోలీసుల‌కి దొరికితే అధికార పార్టీ అండ‌తో త‌ప్పించుకుంటూ ఉంటాడు. గెలిచింది జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున అయినా అమ్ముడుపోయింది వైకాపాకి. త‌న‌ని ప‌దికోట్లకి కొనుగోలు చేయాల‌ని చూసింది తెలుగుదేశం అంటూ మీడియా ముందుకు వ‌చ్చి ప‌తివ్ర‌త‌లా ప‌లావు వండాడు. జ‌న‌సేన సోష‌ల్ మీడియా మామూలుగా ఉండ‌దు. రాపాక బోకు క‌బుర్ల‌ని చీల్చి చెండాడేశాయి. ఆ త‌రువాత తాను దొంగ ఓట్ల‌తోనే గెలిచానంటూ వ్యాఖ్యానించి, ఇప్పుడు ఎన్నిక‌ల క‌మిష‌న్ విచార‌ణ ఎదుర్కొంటున్నారు. మ‌రోవైపు ప్ర‌జాధ‌నం త‌న సొంతానికి వాడుకుని వార్త‌ల్లో నిలిచాడు.  కోనసీమ జిల్లా మలికిపురం మండలం కత్తిమండ గ్రామంలో ఇటీవల ఎమ్మెల్యే  రాపాక వ‌ర‌ప్ర‌సాద్ ఓ ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇంటి వ‌ర‌కూ పంచాయతీ రోడ్డు నుంచి మరో కొత్త రోడ్డు నిర్మించారు. కోట్ల రూపాయ‌ల‌తో ఇల్లు క‌ట్టుకున్న ఎమ్మెల్యే రాపాక, ఆ ఇంటికి రోడ్డు మాత్రం ప్రభుత్వ నిధుల్ని వాడుకున్నాడు. ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరు చేయించుకుని త‌న ఇంటికి ఏకంగా రోడ్డేసేశారు. ఎంపీ ల్యాడ్స్ నిధులు త‌న సొంత ఇంటి రోడ్డుకి వినియోగించార‌ని కేశవదాసుపాలెం గ్రామానికి చెందిన  కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచార‌ణ కూడా జ‌రుగుతుంటే, అడ్డంగా బుక్క‌యిన ఎమ్మెల్యే రాపాక ర‌క‌ర‌కాల క‌హానీలు వినిపిస్తున్నాడు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read