మాజీ మంత్రి పేర్ని నాని మాటకారే కాదు, అద్భుతమైన నటుడు. దరఖాస్తు చేసుకుని వుండడు కానీ, ఆంధ్రా నుంచి ఆస్కార్ ఎగరేసుకుపోయేంత టాలెంట్. పది పైసల పని, వంద రూపాయల ప్రచారంలా ఉంటుంది నాని తీరు. బందరులో మండుటెండలో రోడ్డున వెళుతున్న ఓ వృద్ధురాలికి చెప్పుల్లేవు. ఆమెకి చెప్పులు కొనివ్వడం చాలా మంచి విషయం. కానీ ఆ వృద్ధురాలిని చేయి పట్టుకుని నడిపించి షాపులోకి తీసుకెళ్లే తతంగమంతా షూట్ చేసిన తీరు చూస్తే ఇదంతా ప్రీప్లాన్డ్ షూట్ అని ఇట్టే అర్థం అయిపోతుంది. ఎండలో కాలు కాలిపోతున్న వృద్ధురాలికి చెప్పులు కొన్నానంటూ మీడియా, సోషల్మీడియా అంతటా హోరెత్తిస్తున్న పేర్నినాని..ఆ చెప్పుల ఖరీదు రూ.200. ఆ వృద్ధురాలు తనకి కళ్లు కనపడవంటూ చెబుతూనే ఉంది, కానీ ఐప్యాక్ క్యాంపెయిన్ బృందం ఆ విషయం పట్టించుకోవడంలేదు. ఎండ, వృద్ధురాలు, కాళ్లకి చెప్పులు లేవు...ఈ మూడు అంశాలతో సానుభూతి కొట్టేయొచ్చనే ఆరాటంతో చేసిన ఫోటో షూట్లో చివరిలో ఆ ముసలావిడ తనకి కళ్లు కనిపించవంటూ సాయం అడుగుతుంటే పట్టించుకోకుండా, ఆమె చేతిలో డబ్బులు తీసుకుంటున్నట్టు వీడియోలో ఉంది. ఎంత ఆస్కార్ నటుడైనా ఏదో ఒక షాట్లో దొరికేస్తాడు. ముసలావిడ వెళుతూ చెప్పిన మాటలు ఎడిట్ చేయాల్సింది. ఇప్పుడు ఎంతగా అభాసుపాలయ్యారో చూడండి. పేర్ని నాని అంత దయార్ద్ర హృదయుడే అయితే, నిరుపేదల కోసం టిడిపి కట్టించిన 4 వేల ఇళ్లు ఇప్పటికీ అప్పగించకుండా వారు ఎండలో ఎండుతూ, వానలో నానుతూ..అద్దె ఇళ్లలో తలదాచుకుంటున్నారు. ఒక వృద్ధురాలు ఎండలో చెప్పుల్లేకుండా నడవడం చూడలేకపోయిన పేర్ని నాని, ఇలా వేలాదిమంది వృద్ధులు..చంటిపిల్లలతో ఉన్న కుటుంబాలను నడివీధిలో వదిలేయడం పాపం అంటున్నారు బందరు జనాలు.
ఆంధ్రా ఆస్కార్ పేర్ని నాని ఎండలో ఇరగేసే యాక్టింగ్
Advertisements