అందరూ అనుకున్నదే జరిగింది. కర్ణాటక ఎన్నికలు అయ్యేవరకూ సీబీఐ వివేకా హత్యకేసులో అడుగులు ముందుకు వేయదని అనుకున్నదే జరిగింది. కర్ణాటక ఎన్నికలు ముగిశాయి. బీజేపీ దారుణ పరాజయం చూసింది. కోట్ల మూటలతోని, దొంగ ఓట్లతోని బీజేపీ తరపున వెళ్లిన వైకాపా కీలక మంత్రి పెద్దిరెడ్డి పోల్ మేనేజ్మెంట్ వికటించింది. కమలనాథుల కర్ణాటక అవసరం తీరిపోయింది. మళ్లీ సీబీఐ జూలు విదుల్చుతోంది. వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసు జారీ చేయడంతో వైకాపాలో గందరగోళ వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌లో రేపు సీబీఐ విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని సీబీఐ నోటీసులలో పేర్కొంది. ఇప్పటికే నాలుగుసార్లు సీబీఐ విచారణకి హాజరైన అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకపోవడంతో రకరకాల అనుమానాలు వెల్లువెత్తాయి. వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి అని సీబీఐ పేర్కొంది. తండ్రిని అరెస్టు చేసి కొడుకుని వదిలేయడంతో సీబీఐపైనా, కేంద్రంలోని అదృశ్యశక్తిపైనా అనుమానాలు వచ్చాయి. అంతా అనుకున్నట్టే కర్ణాటక ఎన్నికల అవసరం అయిపోవడంతో ఇక బీజేపీ సీబీఐ తన పని తాను చేసుకోవచ్చనే ఆదేశాలు ఇచ్చి ఉండొచ్చని, రేపు అవినాష్ రెడ్డి అరెస్టు తప్పకపోవచ్చని తెలుస్తోంది.
కర్ణాటక ఫలితాలు రాగానే, అవినాష్ రెడ్డికి షాక్ ఇచ్చిన సిబిఐ...
Advertisements