ఏపీలో శాంతిభద్రతల సమస్యలు సృష్టించేందుకే కొందరు పెద్దలు నిర్ణయించుకున్నట్టు పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. భారీగా అవినాష్ రెడ్డి ప్రైవేటు సైన్యాలు, వైకాపా మూకలు మొహరించేశారు. సీబీఐకి ఏపీ పోలీసులు సహకరించడంలేదు. ఈ గూండా మూకలు మీడియా వాళ్లని, జనాలని చావకొడుతున్నా పోలీసులు కన్నెత్తి చూడటంలేదు. మరోవైపు వ్యూహాత్మకంగానే ఇటువంటిదేదో ప్లాన్ చేసినట్టు ప్రభుత్వ పెద్దల మనిషి పోలీసు శాఖలో పెద్ద తలకాయ సెలవుపై వెళ్లడం అనుమానాలు మరింత బలపడుతున్నాయి. కర్నూలు పోలీస్ గెస్ట్ హౌస్ లోనే సీబీఐ టీమ్ నిరీక్షిస్తున్నా, ఏపీ పోలీసులు వారిని కదలనివ్వడంలేదు. అవినాష్ అరెస్ట్ చేయాలని లోకల్ పోలీసుల సహకారం కోరినా సీబీఐకి సహకరించేందుకు వారు సిద్ధంగా లేరు. దీంతో కేంద్ర బలగాలను రప్పించి..అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ యత్నాలు ఆరంభించింది. సీబీఐ ఇచ్చిన వెసులుబాట్ల వల్లే ఇప్పటివరకూ ఫ్యాక్షన్ ముఠాలతో సీబీఐ కార్యాలయంలో, కోర్టుల్లో, ఇప్పుడు ఆస్పత్రిలో అవినాష్ రెడ్డి కోసం చెలరేగిపోతున్నారు. హైదరాబాద్ నుంచి కర్నూలుకు కేంద్ర బలగాలు చేరుకున్నాక అరెస్టు చేయొచ్చనే సమాచారం నేపథ్యంలో..వైసీపీ నేతలు శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని నేరుగా హెచ్చరిస్తుండడం రాష్ట్రంలో అల్లర్లకి ప్లాన్ చేశారని స్పష్టం అవుతోంది.
వైకాపా లా అండ్ ఆర్డర్ వార్నింగ్ అల్లర్లకేనా? పోలీసు శాఖలో పెద్ద తలకాయ సెలవు!
Advertisements