తెలుగుదేశం పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహంలో అధికార వైసీపీ బొక్కబోర్లా పడిందని వరస సంఘటనలు తేటతెల్లం చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో కీలకమైన నేతలు, సంస్థలు ఇవేనని ఫిక్స్ అయిపోయిన వైసీపీ వ్యూహకర్తల బృందం అందరినీ ఒకేసారి అష్టదిగ్బంధనం చేయాలనే వ్యూహం దారుణంగా బెడిసికొట్టింది. ఇప్పుడు ఎటువైపు అడుగులు వేయాలో తెలియక అయోమయం జంక్షన్‌లో జామ్ అయిపోయారు జగన్ అండ్ కో. టిడిపిలో కీలకనేతలందరినీ కేసులతో ఫిక్స్ చేశామనుకుంటే, ఆ నేతలంతా మరింత యాక్టివ్ అయిపోయారు. కేసులు-అరెస్టులకి భయపడి తగ్గుతారనుకుంటే వారు మరింత రెచ్చిపోతున్నారు. అయ్యన్న, అచ్చెన్న, కొల్లు రవీంద్ర, ధూలిపాళ్ల నరేంద్ర, బీటెక్ రవి, ఆదిరెడ్డి వాసు, పట్టాభి వంటి కీలక టిడిపి నేతలందరినీ ఏదో ఒక కేసులో అరెస్టు చేశారు. బెయిల్ వచ్చాక, ఈ నేతలంతా వైకాపాకి చుక్కలు చూపిస్తున్నారు. టిడిపి కేంద్ర కార్యాలయం ఏదో భూవివాదం అంటూ కేసులు, నోటీసులు ఇచ్చారు. సాక్షిలో ఇక టిడిపికి ఆ ఆఫీసే ఇక లేదని కథనాలు రాసేశారు. అదీ పోయింది. మాజీమంత్రి నారాయణని టార్గెట్ చేశారు. వరస కేసులతో ఉక్కిరిబిక్కిరి చేసి అలిసిపోయారు. ఈ సారి ఏనుగు కుంభస్థలం కొట్టామనుకుని ఈనాడు లక్ష్యంగా మార్గదర్శిపై తనిఖీలు-సోదాలకి తెగబడ్డారు. ఉండవల్లిని దింపారు. 15 రోజుల ఎపిసోడ్ తుస్సుమంది. ఇప్పుడు కరకట్టపై చంద్రబాబు ఇంటిని ప్రభుత్వానికి అటాచ్ చేశారు. అదీ లింగమనేని ఇల్లు. అద్దెకి ఉంటున్నారు చంద్రబాబు. ఈ ఘట్టం తుస్సుమంది. ఇక స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఫైబర్ నెట్ కేసులు ఏమయ్యాయో తెలియదు. ఎటు వేళ్లాలో తెలియదు. ఏం చేయాలో తెలియని దిక్కుతెన్నూ తెలియని వ్యూహంలో అష్టదిగ్బంధనంలో టిడిపిని ఇరకాటంలో పెట్టేశామనుకుంటున్న వైసీపీ పీకల్లోతు సంకటంలో కూరుకుపోయింది.
టిడిపిని ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహంలో వైకాపా బొక్కబోర్లా
Advertisements