ముందస్తుకి వెళ్లాలనుకుంటోన్న జగన్ రెడ్డి ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాడు. కానీ ఏ బాబాయ్ హత్యతో లబ్ధి పొంది సీఎం అయ్యాడో అదే హత్య కేసు వచ్చే ఎన్నికల వ్యూహంలో అడుగులు ముందుకు వేయకుండా ముందరి కాళ్లకి బంధం వేసి పడేసింది. మరోవైపు టిడిపి అధినేత చంద్రబాబు తనదైన రాజకీయ చతురత మొదలు పెట్టారు. దత్తపుత్రుడు అంటూ రోజూ అరుస్తోన్న పవన్ కల్యాణ్ తో భేటీ అయి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. గుడివాడలో ఇటీవల ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించి వైకాపా తురుపుముక్కగా భావించే కొడాలి నానికి అన్యాపదేశంగా హెచ్చరికలు పంపింది. మళ్లీ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకి గుడివాడ అడ్డా చేసుకుని చంద్రబాబు మార్క్ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. ఓ వైపు నందమూరి బాలకృష్ణ, మరోవైపు తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌లు సభకి హాజరై తెలుగుదేశం విజయబావుటాని ముందస్తుగానే ఎగురవేశారు. పవన్ కల్యాణ్‌ని బెదిరించడానికే రజనీకాంత్‌ని తీసుకొచ్చారని కొడాలి నాని ఆరోపించిన మరుసటి రోజే పవన్ కళ్యాన్ నేరుగా చంద్రబాబు ఇంటికి వెళ్లి చర్చలు జరిపి రావడంతో వైకాపా క్యాంపులో గందరగోళం మొదలైంది. వైసీపీ ప్రయోగించే బూతులకు కౌంటర్లు ఇచ్చే పద్దతి మానేసిన తెలుగుదేశం.. కొత్త టాస్క్ ఇస్తూ, దాని చుట్టే వైకాపా తురుపుముక్కలని తిప్పుతూ డిఫరెంట్ పాలిటిక్స్ ప్లే చేస్తూ..ఆటని రక్తి కట్టిస్తోంది.
చంద్రబాబు మార్క్ మాస్టర్ స్ట్రోక్స్... గిల గిలా కొట్టుకుంటున్న వైసీపీ
Advertisements