ఎప్పుడూ కుల ప్రస్తావనలు చేయని టిడిపి ఇటీవల నోరు విప్పుతోంది. ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలో కుల,మత, ప్రాంత విద్వేషాల విషవ్యూహాలను దిగ్విజయంగా అమలు చేసిన వైకాపా అధికారం చేజిక్కించుకుంది. మళ్లీ అదే విషవ్యూహంతో 2024 ఎన్నికలకి సమాయత్త మవుతోంది. అప్పుడే విద్వేషాలకి బీజం వేస్తోంది. గతసారి తెలుగుదేశం అవలంభించిన మెతక వైఖరితో జరిగిన నష్టాన్ని ఈ సారి జరగనివ్వమని తీర్మానించుకున్నట్టున్నారు. టిడిపి అధిష్టానం కుల రాజకీయాల పట్ల చాలా స్పష్టంగా ఉన్నారు. వైసీపీ కుల విద్వేషాలు ప్రయోగించినా, జనాల్ని చైతన్యం చేసి తమ స్టాండేంటో చాలా స్పష్టంగా చెబుతున్నారు టిడిపి అధినేత చంద్రబాబు, లోకేష్. యువగళం పాదయాత్రలో వివిధ సామాజికవర్గాలు తనని కలిసిన సందర్భంలో ప్రతీ కులానికి టిడిపి చేసిన మేలు, వైసీపీ చేసిన కీడు వివరిస్తున్నారు. తెలుగుదేశంపై వైసీపీ పన్నిన విషవ్యూహాన్ని కుండబద్దలుకొట్టారు. టిడిపి ప్రభుత్వం 35 మంది కమ్మవాళ్లకి డిఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చిందని చేసిన ప్రాపగాండా, మీ అందరికీ తెలిసే ఉంటుందని వివరించిన లోకేష్, ఇందులో నలుగురే కమ్మవాళ్లని, అదీ వారి సీనియార్టీ ప్రకారం వచ్చిన ప్రమోషన్ అని వైసీపీ ప్రభుత్వమే సభలో వెల్లడించిందని ఇదీ టిడిపి పారదర్శకత అని వివరించారు. అలాగే జగన్ రెడ్డి వల్ల రెడ్లకీ మేలు జరగలేదని, ఆయన చుట్టూ ఉన్న నలుగురు రెడ్లు తప్పించి అందరినీ మోసం చేశారని ఉదాహరణలతో వివరించారు. తెలుగుదేశంపైకి కులాలని ఎగదోసి వేడుక చూసిన జగన్ కి సరైన సమాధానం చెప్పడానికే నిర్ణయించుకున్న టిడిపి అధినేతలు సరైన కౌంటర్లు ఇస్తున్నారు. ఏ కులానికి ఏం చేయాలనుకుంటున్నామో కూడా వివరిస్తున్నారు.
వైకాపా సం`కుల సమరం`పై తెలుగుదేశం యుద్ధం
Advertisements