చేతిలో అధికారం ఉంది. కేంద్రసర్కారు ఆశీస్సులు ఉన్నాయి. ఏపీలో ప్రజాస్వామ్యానికి పాతరేసినా, రాజ్యాంగాన్ని ఖూనీ చేసినా పట్టించుకునే నాథుడే లేడు. ఇంతటి అరాచక వైకాపాలోనూ అభద్రతాభావం ఉందని తేలిపోయింది. విపక్షాలపైనా, అవినీతిని నిలదీసే మీడియాపైనా, ప్రశ్నించే ప్రజలపైనా ఇప్పటివరకూ దాడులు చేస్తూ వచ్చిన వైకాపా...ఇప్పుడు కొత్త ట్రెండ్ ఎటాక్స్ మొదలు పెట్టేసింది. వైకాపా పాలనని, నేతలని ఏమనకపోయినా..చంద్రబాబుని ప్రశంసించారనే ఏకైక కారణంతో సూపర్ స్టార్ రజనీకాంత్ పై ఒంటికాలుమీద లేస్తున్నారు వైకాపా బూతుకేయులు. రజనీకాంత్ ఏపీలో విధ్వంస పాలన ఊసెత్తలేదు. రాష్ట్రం అప్పులు గురించి ప్రస్తావించలేదు. ప్రజలు కష్టాల పడుతున్నారని ప్రభుత్వాన్ని ఎత్తి చూపలేదు. తన మిత్రుడైన చంద్రబాబు ఒక రాజకీయ నేతగా చేసిన కృషిని ప్రశంసించారు. దీనిపై వైకాపా ఎందుకు ఉలికిపడిందో అంతా ఆశ్చర్యపోతున్నారు. తమిళనాడులోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ రజనీకాంత్ ని ద్వేషించే వాళ్లుండరు. ఆయన కూడా ఎప్పుడూ ఏ వివాదాస్పద వ్యాఖ్యలు చేయరు. ఇప్పుడు కూడా ఆయన తన మిత్రుడైన చంద్రబాబు పనితీరుని కొన్ని ఉదాహరణలతో చెప్పారు. ఇందులో వైకాపాకి జరిగిన ఘోరమేంటో తెలియదు, నష్టం ఏమిటో అర్థంకాలేదు. గుట్కాలు నములుతూ నానా చెత్త వాగిపోయాడు గుడివాడ నాని. ఇంకా రోజా, నోరు కూడా తిరగని దేవినేని అవినాష్, మహాసాధ్వి లక్ష్మీపార్వతి కూడా రజనీకాంత్‌ని తిడుతూ మీడియాకెక్కారు. వీరికితోడు వైకాపా పేటీఎం కార్మికులు ఫేక్ పోస్టులతో చెలరేగిపోతున్నారు. బస్ కండక్టర్‌గా రజని ఉన్నప్పుడు ప్రయాణికుల చిల్లర నొక్కేశాడని, సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకున్న కేసులో చంద్రబాబు కాపాడారని..అందుకే ఇలా చంద్రబాబుని ప్రశంసిస్తున్నారని విషం చిమ్ముతున్నారు. ఇదంతా చూసిన రాజకీయ పరిశీలకులు రజనీకాంత్ ఏపీ గురించి ఒక్క మాట మాట్లాడకపోయినా, వైకాపా ఊసెత్తకపోయినా..ఇంతలా విరుచుకుపడుతున్నారంటే..ఏ స్థాయిలో పార్టీలో అభద్రతాభావం పెరిగిపోయిందో అర్థం అవుతోందని విశ్లేషిస్తున్నారు. ఇదంతా ఓటమి భయం, జైలు భయం అని విడమరిచి మరీ చెబుతున్నారు.
వైసీపీలో ఇంత అభద్రతాభావం దేనికి సంకేతం ?
Advertisements