ముందు రోజు జగన్ రెడ్డి కాలి నొప్పి, తరువాత రోజుకే మాయం కావడంతో నాలుగేళ్ల క్రితం కోడికత్తి డ్రామాని గుర్తుకి తెచ్చిందని టిడిపి నేతలు ఆరోపించారు. టిడిపి ఆరోపణలు పక్కనపెడితే, తీవ్రమైన కాలునొప్పితో అసలు నడవడానికి కూడా వీలు కావడంలేదని, అందుకే ఒంటిమిట్ట సీతారామచంద్రమూర్తి కళ్యాణోత్సవానికి హాజరయ్యే పర్యటన రద్దు చేస్తున్నట్లు ముందు రోజు సీఎంవో ప్రకటన విడుదల చేసింది. మరుసటి రోజే చిలకలూరి పేటలో జరిగిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరై బెణికిన కాలుతోనే వేదికపై చెంగు చెంగున ఎగురుతూ కేడర్ని ఉత్సాహంలో నింపారు. ఒంటిమిట్ట హెలికాప్టర్లో వెళ్లేందుకు సహకరించని కాలు నొప్పి, చిలకలూరిపేట విడదల రజిని నియోజకవర్గంలో కార్యక్రమానికి మాత్రం ఒక్కసారిగా మంత్రమేసి కాలు బెణుకు తగ్గించినట్టు తగ్గిపోయిందా అని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. మంగళవారం ఉదయం సీఎం జగన్ వ్యాయామం చేస్తుండగా ఆయన కాలు బెణికిందని, సాయంత్రానికి నొప్పి ఎక్కువైందని వైద్యుల సూచన మేరకు అధికారులు ఆయన ప్రయాణాలు రద్దు చేసుకున్నారని విడుదల చేసిన ప్రకటన పత్రికలలో అచ్చయ్యి ఇళ్లకు వచ్చేసరికి సీఎం షిక్కటి షిరునవ్వులతో గురువారం విడుదల రజని ఆధ్వర్యంలో ఏర్పాటైన సభలో చలాకీగా తిరుగతూ అందరినీ సంభ్రమాశ్చర్యాల్లో పడేశారు. టీటీడీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న ఒంటిమిట్టలో కోదండ రాముడి కళ్యాణోత్సవాలు నిర్వహణకి పదిహేను రోజుల ముందు నుంచే ఏర్పాట్లు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. సీఎం జగన్ రెడ్డి కూడా ఏప్రిల్ 4వ తేదీ సాయంత్రం బయలుదేరుతున్నారని ఆయన మీడియా హడావిడి చేసిన అరగంటకే కాలు బెణుకు బ్రేకింగ్ వదిలారు. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశ పూర్వకంగానే ఒంటిమిట్ట పర్యటన రద్దు చేసుకొన్నారని, అన్యమతస్థులు ప్రాపకం కోసమే ఉద్దేశపూర్వకంగా ఒంటిమిట్ట పర్యటన ఎగ్గొట్టారని బీజేపీ నేతలు ఆరోపించారు. కాలు నొప్పితో ఒంటిమిట్ట పర్యటన రద్దుచేసుకుని, తరువాతి రోజే చిలకలూరిపేట కార్యక్రమానికి వెళ్లడం..ఇది మరో కోడికత్తి డ్రామా అని ఎద్దేవ చేశారు.
జగన్ రెడ్డి కాలు బెణకడం వెనుక ఇంత స్టొరీ ఉందా ?
Advertisements