ఏపీలో విచ్చ‌ల‌విడి గంజాయి అమ్మ‌కాల‌కి అడ్డుక‌ట్ట వేయాల‌ని, మ‌త్తులో జోగుతున్న యువ‌త భ‌విష్య‌త్తు కాపాడాల‌ని టిడిపి యువ‌నేత నారా లోకేష్ పెద్ద ఎత్తున ఉద్య‌మిస్తున్నారు. ఆయ‌న ఉద్య‌మం న‌డుస్తున్న రోజుల్లోనే వేల కేజీల గంజాయి రాష్ట్రంలో య‌థేచ్ఛ‌గా ర‌వాణా అవుతోంది. చంద్ర‌గిరిలో హైస్కూల్ పిల్ల‌లు గంజాయి బానిస‌ల‌య్యార‌ని, డ్ర‌గ్స్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని లోకేష్ ప్ర‌ధాన‌మంత్రికి లేఖ రాశారు. ఏపీ స‌ర్కారు మాదిరిగానే కేంద్రం కూడా తాము విడుద‌ల ఎన్సీఆర్బీలో గంజాయిలో ఏపీ నెంబ‌ర్ వ‌న్ ఉంద‌ని చెప్పి చేతులు దులుపుకుంది. గంజాయి, డ్ర‌గ్స్ స‌ర్కారు ఎలాగూ అరిక‌ట్ట‌దు, తామే యువ‌తని ఈ మ‌హ‌మ్మారి నుంచి కాపాడాల‌నే ఉద్దేశంతో ఉద్య‌మం టిడిపి ఆరంభించింది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం  సందర్భంగా  తెలుగుదేశం పార్టీ ఆధ్వ‌ర్యంలో గంజాయి వద్దు బ్రో #GanjaOdhuBro హ్యాష్ ట్యాగ్ తో పెద్ద ఎత్తున చైత‌న్య కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.  యువగళం పాదయాత్రలో  గంజాయి వద్దు బ్రో అంటూ  లోకేష్,  బాలయ్య ప్రచారం చేపట్టారు. ఓ వైపు గంజాయిని అరిక‌ట్టాల‌ని టిడిపి పెద్ద ఎత్తున ఉద్య‌మిస్తుంటే, రేగుపాలెం మార్కెట్ యార్డ్ చెక్ పోస్ట్ వద్ద చేసిన త‌నిఖీల‌లో పెద్ద ఎత్తున గంజాయి దొరికింది. లారీలో తీసుకెళ్తున్న సుమారు 1,200 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు, లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. అంతే అంత‌కుమించి ఈ గంజాయి య‌జ‌మానులెవ‌రో మాత్రం తేల‌దు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read