ఉరవకొండ సభలో నారా లోకేష్ కొత్త విషయాలు వెల్లడించారు. లోకేష్ చేసిన సెన్సేషన్ కామెంట్స్‌తో వైసీపీ వైనాట్ 175 కాదు, ఉన్న 151 మందిలో ఎంత మంది జగన్ రెడ్డితో ఉంటారో అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఉరవకొండ సభలో లోకేష్ తన ప్రసంగం తీరుని మార్చి వైసీపీ అంతర్గత రాజకీయాలని టార్గెట్ చేశారు. ఇటీవల వైసీపీ ఎమ్మెల్సీలు ఓడిపోవడాన్ని జగన్ రెడ్డి ఓటమిగా భావిస్తూ వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో గ్రాండ్ పార్టీ చేసుకున్నారని సంచలన విషయాలను లోకేష్ వెల్లడించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ మూడుస్థానాల్లో ఓడిపోవడంతో వైసీపీ నేతలే సంబరాలు చేసుకున్నారనే ది ప్రచారం కాదని, నిజమేనని లోకేష్ వ్యాఖ్యలతో తేలిపోయింది. జగన్ రెడ్డి ఓటమిని సెలబ్రేట్ చేసుకున్నది సాదాసీదా మండల నేతలు కాదు. ఇద్దరు ఎంపీలు, 17 మంది వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఈ పార్టీలో ఉన్నారని ప్రచారం సాగుతోంది. వైసీపీకి చెందిన ఓ ఎంపీ రిసార్ట్‌లో రాత్రి ఆరంభమైన రాత్రి తెల్లార్లూ రంజుగా సాగిందట. మందు, విందు, చిందు, వినోదాలతో తేలియాడిన ఎంపీ, ఎమ్మెల్యేలు తమ పార్టీ అధినేత జగన్ రెడ్డికి పట్టభద్రులు సరైన గుణపాఠం చెప్పారని గెంతులు వేశారట. రిసార్ట్ పార్టీకి హాజరైన వారిలో ఎక్కువమంది జగన్ రెడ్డి సామాజికవర్గీయులు ఉండటం మరో ట్విస్ట్. పార్టీ కోసం తామెంతో శ్రమిస్తే ..గడ్డిపోచల్లా తీసి పారేసిన తమ అధినేతకి టిడిపి మంచిగా గుణపాఠం చెప్పిందని పార్టీలోనే కేకలు వేశారట ఎంపీలు. ఇప్పటికే అసమ్మతిలో బయటపడిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవితోపాటు 17 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలపైనా నిఘా తీవ్రతరం చేశారని తెలుస్తోంది.
జగన్ ఓటమిని హైదరాబాద్ లో వైసీపీ ఎమ్మెల్యేలు సెలబ్రేట్ చేసుకున్నారా ? సంచలన విషయం బయటకు...
Advertisements