పోసాని కృష్ణ‌ముర‌ళీ మెంట‌ల్ కృష్ణ సినిమా తీసిన‌ట్టున్నారు. ఆయ‌న వ్య‌వ‌హార‌శైలి కూడా మెంట‌ల్ మ‌నిషిలాగానే ఉంటుంది. స‌రిగ్గా రెండేళ్ల క్రితం నంద‌మూరి బాల‌కృష్ణపై ప్ర‌శంస‌లు కురిపించిన ఇదే పోసాని కృష్ణముర‌ళి..నేడు అదే బాల‌య్య‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం త‌న‌కి ప‌ద‌వి ఇచ్చిన జ‌గ‌న్ రెడ్డి ప్రాప‌కం కోస‌మేన‌ని తేలిపోయింది. జ‌గ‌న్ రెడ్డి త‌న‌కు ఎఫ్‌డీసీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చార‌నే కృత‌జ్ఞ‌త‌తో పోసాని కృష్ణమురళి పిచ్చ‌పిచ్చ‌గా మాట్లాడుతున్న తీరుపై టిడిపి ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. జ‌గ‌న్ రెడ్డికి భ‌జ‌న చేసుకుంటే  త‌మ‌కేమీ అభ్యంత‌రంలేద‌ని, టిడిపి జోలికొస్తే పోసాని మెంట‌ల్ వ‌దిలించేలా జ‌వాబిస్తామంటున్నారు.  సీఎం  జగన్ మోహ‌న్ రెడ్డి పాల‌న గురించి బాలకృష్ణ మాట్లాడుతూ  సైకో అనడంపై పోసాని కృష్ణ‌ముర‌ళితో కౌంట‌ర్ ఇప్పించారు. ముఖ్య‌మంత్రి సైకోనా, లేక బాల‌కృష్ణ సైకోనా అని ఓసారి ఆత్మ విమ‌ర్శ చేసుకోవాలంటూ పోసాని రెచ్చిపోయారు. బాలకృష్ణ‌ తుపాకీతో ట‌పీ ట‌పీమ‌ని ఇద్దరిని కాల్చేశార‌ని సైకోలే ఇలా కాలుస్తారంటూ పోసాని చేసిన వ్యాఖ్య‌లు ముమ్మాటికీ జ‌గ‌న్ రెడ్డి కోసం చేసిన సాని వ్యాఖ్య‌లేనంటున్నారు. 2020లో సినీ ప‌రిశ్ర‌మ రాజ‌కీయ నేత‌ల‌తో చర్చలకు బాలయ్యను ఆహ్వానించకపోవటంపై చాలా గౌర‌వంగా స్పందించిన‌ పోసాని కృష్ణమురళి..2023లో జ‌గ‌న్ ప‌ద‌వి ఇచ్చాక స్పందించిన పోసాని ముర‌ళీ వ్యాఖ్య‌లు ఆయ‌న అవ‌కాశ‌వాద రాజ‌కీయాల‌కు నిద‌ర్శ‌నం అని విశ్లేష‌కులు అంటున్నారు. `బాలయ్యకు కోపం ఎక్కువ అన్న మాట నిజమే, కానీ ఆ కోసం వెనుక పెద్ద కారణమే ఉంటుంది. నేను బాలయ్యతో రెండు మూడు సినిమాలకు కలిసి పనిచేశాను. ఆయన చాలా డీసెంట్‌గా ఉంటారు. పని పట్ల చాలా నిబద్దతగా ఉంటారు. మంచి ఉంటే మంచి చెడు ఉంటే చెడు అన్నట్టు వ్యవహరిస్తారు బాలయ్య` అని చెప్పుకొచ్చారు. బాలయ్య ముఖానికి తెర వేసుకోడని లోపల ఏది అనిపిస్తే అదే చేస్తాడని చెప్పాడు. మేకప్‌ ముందు ఒక మాట మేకప్ తరువాత ఓ మాట చెప్పే మనస్తత్వం బాలయ్యది కాదని చెప్పాడు. వ్యక్తులు చిన్నవారా పెద్ద వారా అన్న విషయం పట్టించుకోకుండా సీఎం అయినా సామాన్యుడైనా ఒకే విధంగా బాల‌య్య గౌరవిస్తాడని తెలిపాడు. అవినీతి అక్రమం చేద్దామన్న ఆలోచన కూడా ఆయనకు ఉండదని, చాలా జెన్యూన్‌గా ఉంటాడని, ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో ఆయన పదవిని అడ్డు పెట్టుకొని సంపాదించుకోవాలని బాల‌య్య అనుకోలేద‌ని 2020లో ప్ర‌శంసించిన పోసాని 2023లో ప‌ద‌వి వ‌చ్చేస‌రికి అదే బాల‌య్య‌ని సైకో-హంత‌కుడు అన‌డం ముమ్మాటికీ సాని క‌బుర్లేన‌ని తేలిపోతోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read