మరో మహానాడుకి సర్వం సిద్ధమైంది. రాజమహేంద్రవరం వేదికగా 27, 28 తేదీల్లో తెలుగుదేశం పార్టీ మహా పండగ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. అయితే ఏపీ సర్కారు తీరు, పోలీసుల వ్యవహారమే మహానాడు నిర్వాహకులకి భయం కలిగిస్తోంది. ఒంగోలులో గతేడాది మహానాడు నిర్వహణకి అడుగడుగునా ఆటంకాలు కల్పించారు. ఆర్టీసీలు బస్సులు ఇవ్వలేదు. ప్రైవేటు బస్సులు ఇవ్వొద్దని బెదిరించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరించకుండా పోలీసులే కారు టైర్లలో గాలి తీసేయడం, వాహనాలు అడ్డంగా నిలిపేయడం వంటివి చేపట్టారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఒంగోలు మహానాడుని అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం మహానాడుకి వైకాపా సర్కారు కుతంత్రాలు వెంటాడుతాయనే భయాందోళనలు ఉన్నాయి. ట్రాఫిక్ గురించి ఇప్పటికే లేఖ రాసినా డిజిపి స్పందించలేదు. మహానాడుకు భద్రతా ఏర్పాట్లు కల్పించాల్సిందిగా కోరుతూ డీజీపీకి ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. సంస్థ నిబంధనల మేరకు డబ్బులు కడతామని ఆర్టిసి బస్సులు ఇవ్వాలని మేనేజింగ్ డైరెక్టర్‌కి లెటర్ పంపారు. అయితే ప్రభుత్వం పోలీసులు, ఆర్టీసీ అధికారులపై ఒత్తిడి తెస్తోందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో టిడిపి కేడర్‌లో ఆందోళన నెలకొంది. లక్షలాది మంది తరలివచ్చే మహానాడుని రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరి గ్రామంలో నిర్వహిస్తున్నారు. మామూలుగానే రాజమహేంద్రవరంలో తరచూ ట్రాఫిక్ జాములు జరుగుతుంటాయి. నదిపై వంతెనలు, జాతీయ రహదారుల వల్ల విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. మహానాడుకి వచ్చే వేలాది వాహనాలు, లక్షలాది జనం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని టిడిపి అధ్యక్షుడు లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
మహానాడుపైనా జగన్ రెడ్డి మార్కు కుట్రలు
Advertisements