టిడిపి అధినేత చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి వుందనే సంకేతాలు మరోసారి వెలువడ్డాయి. ఈ సారి ఆషామాషీ వ్యక్తి కాదు. రాజ్యాంగబద్ధ పదవి స్పీకర్ స్థానంలో వున్న వ్యక్తి..చంద్రబాబుని ఫినిష్ చేస్తామంటూ హెచ్చరించడం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే బహిరంగసభలలో చంద్రబాబుపై రాళ్లతో ఎటాక్ చేసిన ఆగంతకులు, సెక్యూరిటీ సిబ్బంది రక్షణగా నిలవడంతో సేఫ్ అయ్యారు. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న బాబుపైకి గూండాల్ని పంపి రాళ్లు వేయించే ముఠా ఎవరో చెప్పాల్సిన పనిలేదు. చంద్రబాబు భద్రతాధికారులు రెండుసార్లు తీవ్రంగా గాయపడ్డారు. బాబుని కాపాడారు. ఎన్ఎస్జీ కమాండోలు, భద్రతాసిబ్బంది ఇచ్చిన ఫిర్యాదులపై నేటికీ చర్యల్లేవు. అంటే ఎవరు ఇవి చేయించారో తెలిసిపోతోంది. చంద్రబాబు ఇంటి మీదకి ఏకంగా గూండాలతో దాడికి దిగిన ఎమ్మెల్యే జోగి రమేష్‌పై కేసు పెట్టాల్సిన ఏపీ ప్రభుత్వం మంత్రి పదవి ఇచ్చింది. అంటే చంద్రబాబుకి ప్రాణహాని తలపెట్టేవారికి అందలం ఎక్కిస్తున్నారంటే దీని వెనుక ఉన్నది ఎవరో ఇట్టే స్పష్టం అయిపోతోంది. స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి ప్రతిపక్షనేతని ఫినిష్ చేస్తామంటూ నర్మగర్భంగా హెచ్చరించారంటే, ఇప్పటివరకూ చంద్రబాబుపై చేసిన దాడులన్నీ వారు చేయించినవేనని ఒప్పుకున్నట్టే అయ్యింది. చంద్రబాబుకు ఉన్న బ్లాక్ కమాండోల భద్రతను తీసేస్తే ఫినిష్ అయిపోతారని స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యలు కామెడీవి కావు. వైసీపీ నుంచి చంద్రబాబుని చంపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా, జెడ్ ప్లస్ భద్రత ఉన్న కారణంగా సాధ్యం కావడంలేదని స్పీకర్ మాటలే స్పష్టం చేస్తున్నాయి. బాబుపై చేస్తున్న హత్యాయత్నాలు ఫలించకపోవడానికి అడ్డుగా ఉన్న ఎన్ ఎస్ జీ భద్రతా సిబ్బంది(బ్లాక్ క్యాట్ కమాండోలు)ను తొలగించాల్సిందిగా తాను కేంద్రానికి లేఖ రాస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యలపై విచారణ జరపాలి. చంద్రబాబు భద్రతను ఉపసంహరించాలని స్పీకర్ హోదాలో కేంద్రాన్ని కోరుతానని తమ్మినేని ప్రకటించడం, చంద్రబాబుపై జరుగుతున్న ఎటాక్స్ ఒక దానికొకటి సంబంధం ఉందని, దీనిపై లోతుగా దర్యాప్తు జరపాలని టిడిపి డిమాండ్ చేస్తోంది
చంద్రబాబు హత్యకి వైసీపీ కుట్ర ? స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలతో ఉలిక్కిపడ్డ టిడిపి...
Advertisements