ఐపీఎల్ ఎల్లో ఆర్మీ చెన్నై సూప‌ర్ కింగ్స్ ఎగ‌రేసుకుపోయింది. ఉత్కంఠ‌పోరులో చివ‌రి బంతికి విజ‌యం సాధించి ఐదోసారి ఐపీఎల్ కింగ్స్ తామేన‌ని చెన్నై సూప‌ర్ కింగ్స్ నిరూపించింది. ఐపీఎల్లో ప‌సుపు ప‌తాకం రెప‌రెప‌లాడింది. అదే స‌మ‌యంలో రాజ‌మ‌హేంద్ర‌వ‌రం మ‌హానాడు వేదిక నుంచి ధోనీలాగే మిస్ట‌ర్ కూల్ టిడిపి కెప్టెన్ సీబీఎన్ కూడా సిక్స‌ర్ కొట్టారు. మిని మేనిఫెస్టోతో విడుద‌ల చేసిన ఆరు హామీలు ఏపీఎల్‌(ఆంధ్ర‌ప్ర‌దేశ్ పొలిటిక‌ల్ లీగ్‌)లో ఎల్లో ఆర్మీని తిరుగులేని జ‌ట్టుగా నిలప‌నున్నాయ‌ని వైబ్రేష‌న్స్ చూస్తే ఇట్టే అర్థం అయిపోతోంది.  నాలుగేళ్ల వైసీపీ పాల‌న‌లో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పున‌ర్మిర్మాణం బాధ్య‌త తీసుకుంటాన‌ని, ప్ర‌జ‌ల భ‌విష్య‌త్త‌కు భ‌రోసాగా నిలుస్తాన‌ని మినీ మేనిఫెస్టో చంద్ర‌బాబు విడుద‌ల చేశారు.  ‘భవిష్యత్ కు గ్యారెంటీ’ పేరుతో ఎన్నికల మేనిఫెస్టో  ప్రకటించిన చంద్రబాబు మహిళల కోసం ‘మహాశక్తి’  ప్ర‌క‌టించారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 మహిళల ఖాతాల్లో వేస్తామ‌న్నారు. ‘తల్లికి వందనం’ కింద ప్రతి బిడ్డ తల్లికి ఏటా రూ.15 వేలు ఇస్తామ‌ని, ఎంత మంది పిల్ల‌లు ఉంటే అంద‌రికీ వ‌ర్తిస్తుంద‌న్నారు. ఇంటికి ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అంద‌జేస్తామ‌ని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జిల్లా పరిధిలో ఉచిత ప్రయాణం ప‌థ‌కం ప్ర‌క‌టించారు. యువత కోసం ‘యువగళం’ కార్యక్రమం కింద  యువగళం నిధి కింద ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేలు భృతి అంద‌జేస్తామ‌ని, 20 ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని పేర్కొన్నారు. రైతుల కోసం ‘అన్నదాత’ కార్యక్రమం ప్ర‌క‌టించిన బాబు రైతులకు ఏటా రూ.20 వేలు ఇస్తామ‌ని, ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇచ్చి సుర‌క్షిత తాగునీరు అందిస్తామ‌ని, బీసీల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామ‌ని మ‌హానాడు వేదిక‌గా ప్ర‌క‌టించారు. పేద‌ల‌ని సంప‌న్నులుగా తీర్చిదిద్దే బాధ్య‌త వంటి ఆరు హామీలు సీబీఎన్ కొట్టిన సిక్స‌ర్ అనీ, ఇవి తిరుగులేని విజ‌యం సాధించి పెడ‌తాయ‌ని టిడిపిలో హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం అవుతున్నాయి. ప్ర‌జ‌లు కూడా మెరుగైన సంక్షేమం త‌మ‌కు అందుతుంద‌నే ఆనందంలో ఉన్నారు. అధికార పార్టీ స్పంద‌న చూస్తుంటే..ఏపీఎల్ ఎల్లో పార్టీ టిడిపి ఎగ‌రేసుకుపోవ‌డం ఖాయ‌మ‌ని స్ప‌ష్టం అవుతోంది. ఎల్లో ఆర్మీ చెన్నై సూప‌ర్ కింగ్స్‌ని..ధోనీ ముందుండి విజ‌యం వైపు న‌డిపించ‌గా, ఎల్లో పార్టీ టిడిపిని విజ‌న‌రీ లీడ‌ర్ సీబీఎన్ అంతా తానై గెలుపు తీరం చేర్చే దిశ‌గా న‌డిపిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read