టిడిపి అధినేత చంద్రబాబు ఇటీవల ఢిల్లీలో చేసిన మెరుపు టూరుతో వైసీపీ బేజారెత్తిపోతోంది. ఇప్పటివరకూ తాము ఆడిందే ఆటగా, పాడిందే పాటగా ఆమోదిస్తున్న కేంద్రంలోని బీజేపీ పెద్దలు...తన హవా జనంలో తగ్గిపోయిందని గుర్తించిన తరువాతే బాబుని పిలిపించుకున్నారనే విషయంపై క్లారిటీ తెచ్చేసుకున్నారు జగన్. ఇప్పుడు ముందస్తుకి వెళ్తే ఉన్నది పోయింది-ఉంచుకున్నదీ పోతుంది అనే తీరుగా తన పరిస్థితి తయారవుతుందని పసిగట్టిన జగన్ ముందస్తు లేదు తూచ్ అనేశారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలు తనని అవసరానికి వాడుకుని, ప్రజాదరణ తగ్గిపోయిందని గుర్తించి దూరం పెట్టినా ఏం చేయలేని నిస్సహాయస్థితి జగన్ రెడ్డిది. తనని దేకడంలేదు సరే, తనకీ-బీజేపీకి కూడా అస్సలు గిట్టని చంద్రబాబుతో ఎలా కలుస్తారనేది జగన్ కి నిద్రపట్టనీయడంలేదు. కేంద్రం దూరమయ్యే స్థితిలో, ముందస్తుకి వెళ్లి 9 నెలలు పాలించే అధికారాన్ని కూడా ఎందుకు పోగొట్టుకోవాలనే ఆలోచనలో వైసీపీ పాలకులు ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు పడైనా..పూర్తిస్థాయి అధికారం అనుభవించేద్దామని, ఆ తరువాత ఎలాగూ ఓడిపోతాం కాబట్టి దొరికినంత దోచుకుందామనే ప్లాన్‌లో ఉన్నారని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. చంద్రబాబు అమిత్‌షాతో ఏం మాట్లాడారో ఎవరూ చెప్పలేదు. కానీ పిక్చర్ వైసీపీ కళ్లకి క్లియర్ అయిపోయింది. అందుకే కేబినెట్ మీటింగ్‌లోనే ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉండవని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలని సీఎం జగన్ రెడ్డి తేల్చేశారు.
చంద్రబాబు ఢిల్లీ టూరు.. వైసీపీ బేజారు..
Advertisements