జగన్ రెడ్డికి కావాల్సింది బాబాయ్ హత్యకేసు నుంచి తాను తప్పించుకోవడం, తమ్ముడు అవినాష్ రెడ్డిని తప్పించడం. కేసీఆర్ కి అత్యవసరమైనది ఢిల్లీ లిక్కర్ స్కాములో కుమార్తె కవిత ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు కాకుండా చూడటం. దేశాన్నిఅంతా శాసిస్తూ దేశ రాజధాని అయిన ఢిల్లీలో మాత్రం తమకి అడుగడుగునా అడ్డుతగులుతున్న కేజ్రీవాల్‌ని అడ్డు తొలగించుకోవడం బీజేపీ కేంద్ర నాయకత్వం ముందున్న ప్రథమ లక్ష్యం. ఈ ముగ్గురి అవసరాలు తీర్చేందుకు ఒకే ఒక దారి దొరికింది. అదే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ నేత శరత్ చంద్రారెడ్డిని అప్రూవర్‌గా మార్చడం. ఢిల్లీ లిక్కర్ స్కాములో శరత్ చంద్రారెడ్డిని అప్రూవర్ గా మార్చడంలో ఏపీ సీఎం జగన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. అటు బీజేపీ చెప్పినట్టు తలాడించిన వెంటనే వైఎస్ వివేకానందరెడ్డి కేసులో అవినాష్ రెడ్డి సేఫ్ అయిపోయాడు. జగన్ రెడ్డిని విచారించాల్సిన సీబీఐ మౌనం దాల్చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో క్వీన్ అని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ కుమార్తె కవిత పేరు చార్జిషీట్లలో కనిపించలేదు. అంటే ఢిల్లీలో కేజ్రీవాల్ కి చెక్ పెట్టడానికి ఇటు జగన్ రెడ్డి గ్యాంగ్‌ని, అటు కవిత సిండికేట్‌ని కూడా వదిలేశారని స్పష్టం అవుతోంది. కేజ్రీవాల్ చాలా అమాయకంగా కేసీఆర్, జగన్ రెడ్డితో చేతులు కలిపి ఎంత పెద్ద తప్పు చేశానో అని ఇప్పుడు అర్థం చేసుకుని ఉంటారు. అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనం లేదన్న చందంగా మారింది పరిస్థితి. ఢిల్లీ మద్యం కేసులో శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారిన వెంటనే పరిస్థితులన్నీ ఈ సిండికేటులో కీలకంగా ఉన్న జగన్ గ్యాంగ్, కేసీఆర్ ఇంటి మనుషులకి అనుకూలంగా మారిపోయి రిలీఫ్ దొరికేస్తోంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా భార్య మంచంపై ఉంది. అయినా ఆయనకి బెయిల్ దొరకలేదు. ఈ లిక్కర్ స్కాంలో పెద్ద చేయి అయిన కేసీఆర్ కుమార్తె కవిత పేరే మాయం చేశారు. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన తనయుడు రాఘవరెడ్డికి రిలీఫ్ ఇచ్చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం అక్కడ కేజ్రీవాల్ మనుషులతో కలిసి చేసిన జగన్ రెడ్డి, కేసీఆర్ మనుషులు అదే కేసులో ఎటువంటి సంబంధం లేనట్టు తప్పించుకుని..పూర్తిగా కేజ్రీవాల్ ని ఇరికించేశారు.
కేసీఆర్ జగన్ ఒక్కటై మోదీషాలకి కేజ్రీవాల్ ని అందించేశారు
Advertisements