అందరూ అనుమానిస్తున్నదే అన్నారు సీపీఐ నేత నారాయణ. బాబాయ్ హ-త్యకేసు విచారణ సీబీఐ చివర దశకు చేర్చడంతో, దాని నుంచి కీలక పెద్దల్ని తప్పించేందుకే జగన్ రెడ్డి తరచూ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని ఏపీలో విపక్షాలు కోడై కూస్తున్నాయి. ఇదే విషయాన్ని సీపీఐ నారాయణ కూడా కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. జగన్ పదే పదే ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో బట్టబయలైందని నారాయణ సంచలన ఆరోపణలు చేశారు. తన బాబాయ్ వివేకానందరెడ్డి హ-త్య కేసు విచారణ చివరి దశకు రావడంతో భయంతో జగన్ ఢిల్లీకి వెళ్తున్నాడని చెప్పుకొచ్చారు. బీజేపీతో జగన్ డీల్ ఓకే అయ్యిందని, అమిత్ షాతో జగన్ రాజకీయ ఒప్పందం కుదుర్చుకున్నాడని వెల్లడించారు. కేసుల నుంచి తప్పించుకోవడానికి కర్నాటక ఎన్నికల్లో 100 సీట్లు గెలిపించాలని అమిత్ షాతో ఒప్పందం కుదిరిందని నారాయణ వెల్లడించారు. జగన్ సంపాదించిన అక్రమ ఆస్తులు మొత్తాన్ని కర్నాటక ఎన్నికల్లో ఖర్చు చేయబోతున్నాడని ఆరోపించారు. బీజేపీతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా బాబాయ్ వివేకా హ-త్య కేసు తీర్పు ఆలస్యం కాబోతుందని నారాయణ ఆరోపించడం కలకలం రేపుతోంది. అయితే జగన్ ఢిల్లీ పర్యటనలు, బీజేపీ పెద్దలతో మంతనాలపై బీజేపీ ఏనాడూ స్పందించడంలేదు. నారాయణ ఆరోపణలపై స్పందిస్తుందేమో చూడాలి.
బీజేపీతో జగన్ డీల్ ఓకే ? కర్ణాటక ఎన్నికల ఖర్చుతో ఒప్పందం ?
Advertisements