జగన్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా కొడాలి నాని లేని లోటు చాలా స్పష్టంగా కనపడుతోందని వైసీపీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. కొడాలి నాని ప్లేస్ ని ఆయనని మించే నోరున్న తమ్మినేని సీతారాంతో భర్తీ చేయాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. తమ్మినేని సీతారాం రాజ్యాంగబద్ధమైన, గౌరవనీయమైన స్పీకర్ పదవిలో ఉంటూ చాలా దారుణమైన భాషలో మాట్లాడడం, అసెంబ్లీలో ప్రతిపక్ష టిడిపిపై అధికార వైసీపీ ఎమ్మెల్యేల కంటే ముందుగానే స్పీకర్ తమ్మినేని మాటలతో టార్గెట్ చేయడం చూసిన జగన్ రెడ్డి ఆయనని మంత్రిని చేయాలని డిసైడ్ అయ్యారట.
కొడాలి నాని ప్లేస్ భర్తీ చేయడంతోపాటు, కాళింగులకు మంత్రి పదవి లేదని, తమ్మినేనిని మంత్రిని చేసి వారి ఓట్లకు గాలం వేయొచ్చనేది వైకాపా వ్యూహం అని అంటున్నారు. కేబినెట్ విస్తరణ దిశగా ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలు తీసుకోవచ్చని వైకాపా ఆశావహులు ఎదురుచూస్తున్నారు. మంత్రి పదవులు కోల్పోయేవారు, ఆశిస్తున్నవారు వరసగా సీఎంని కలుస్తున్నారు. తమ్మినేని సీతారాం సీఎం జగన్ రెడ్డిని తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కలవడంతో బెర్త్ ఖాయమని గుసగుసలు బయటకొచ్చాయి. మొత్తానికి మంత్రివర్గంలో కొడాలి నానీని తమ్మినేని సీతారాంతో రీప్లేస్ చేయాలని సంచలన నిర్ణయం వైకాపాలో జోష్ నింపుతోంది.
తమ్మినేని, కొడాలి నానికి జగన్ బంపర్ ఆఫర్
Advertisements