ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అకస్మాత్తుగా ఢిల్లీ పర్యటనకి వెళ్లారు. ఓవైపు జీ-20 సమావేశాలు విశాఖలో జరుగుతుండగా హుటాహుటిన ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి చేరుకోవడంతో రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. తన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి కేసు విచారణ జోరందుకున్న ప్రతీసారీ జగన్ ఢిల్లీకి వెళ్తుండడంపై టిడిపి చాలా వ్యంగ్యంగా ప్రశ్నిస్తోంది. ప్రతీసారీ సీఎం జగన్ రెడ్డి టూరుపై పోల్ నిర్వహించే టిడిపి యువనేత లోకేష్ ఈ సారి కాస్త డిఫరెంట్ సెటైర్ ఎక్కుపెట్టారు. జగన్ ఢిల్లీటూర్ల పై ప్రజలకు క్విజ్ పోటీ అంటూ ట్విట్టర్లో మూడు ఆప్షన్లతో ట్వీటేశారు. మొదటిది జగన్ ఢిల్లీ టూర్ ఇది ఎన్నోసారి? అని ప్రశ్నించారు. రెండో ప్రశ్నగా ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం ఇప్పటి వరకూ రాష్ట్రానికి ఏం సాధించారు? అని నిలదీశారు. ప్రతీసారి ప్రత్యేక విమానంలో వెళ్లి రాష్ట్ర ప్రయోజనాలు ఏమీ సాధించకుండా రావడంపై కూడా మూడో ప్రశ్నగా ప్రత్యేక విమానానికి ఎన్ని కోట్లు ఖర్చు? అని అడిగారు. ఒక నెలలో రెండుసార్లు హఠాత్తుగా అత్యంత ముఖ్య సమావేశాలు వదిలి మరీ ఢిల్లీ వెళ్లింది తన వ్యక్తిగత ఇబ్బందులు, కేసుల నుంచి రక్షణ కోసమేనని టిడిపి ఆరోపిస్తోంది. దీనిపై వైసీపీ క్యాంపు స్పందించకపోవడం, కేసుల ఊసు వచ్చినప్పుడే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లడం టిడిపి అనుమానాలకు ఊతం ఇస్తోంది.
విశాఖలో జీ-20 సమావేశాలు వదిలేసి మరీ ఢిల్లీ వెళ్ళటం వెనుక ఇంత స్కెచ్ వేసారా ?
Advertisements