వైసీపీలో సీఎం నుంచి వార్డు వాలంటీర్ వ‌ర‌కూ అంద‌రిలోనూ ఫ్ర‌స్టేష‌న్ పీక్స్‌కి చేరింది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఓట‌మి త‌రువాత ఇది మ‌రింత పెరిగిపోయింది. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన నుంచీ ప్ర‌శ్నించే వాళ్ల‌ని నానా హింస‌లు పెడుతూనే ఉన్నారు. ఏకంగా ప్ర‌తిప‌క్ష‌నేత చంద్ర‌బాబు ఇంటిపైకి రౌడీలు ఎటాక్ చేశారు. టిడిపి కేంద్ర కార్యాల‌యాన్ని ధ్వంసం చేశారు. మాజీమంత్రులు చాలా మందిని అక్ర‌మ కేసుల్లో అరెస్టులు చేశారు. ఈ అరాచ‌క పాల‌న నాలుగేళ్లుగా సాగుతోంది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌లో మూడు చోట్ల ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాలు కోల్పోయింది. ఆ త‌రువాత ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానం ఒక్క‌టి, అది కూడా త‌న‌ది కానిది వైసీపీ ఓడిపోయింది. ఈ ఫ్ర‌స్టేష‌న్‌లో ఉన్న వైసీపీ అధినేత‌కి బాబాయ్ హ‌-త్య కేసు, ఢిల్లీ లిక్క‌ర్ కేసు మెడ‌కి చుట్టుకున్నాయి. దీంతో తీవ్ర‌మైన అస‌హ‌నంలో ఉన్నారు. అన్ని జిల్లాల్లోనూ విప‌క్షాల‌పై ఎటాక్స్‌కి వైకాపా శ్రేణులు దిగుతున్నాయి. అమరావ‌తి ఉద్య‌మం 1200 రోజుల‌కు చేరుకున్న సంద‌ర్భంగా వివిద రాజ‌కీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి. వారిపై డైరెక్ట్ ఎటాక్‌కి దిగింది వైసీపీ. తెనాలిలో టిడిపి కౌన్సిల‌ర్ యుగంధ‌ర్ పై కౌన్సిల్ హాలులోనే వైకాపా నేత‌లు దా-డి-కి దిగారు. పుట్ట‌ప‌ర్తిలో టిడిపికి చెందిన మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కారును ధ్వంసం చేశారు. రాళ్లు, కర్రలతో వైసీపీ శ్రేణులు విధ్వంసం సృష్టించాయి. చూస్తుంటే, వైసీపీ రాష్ట్ర‌వ్యాప్తంగా హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌కి పాల్ప‌డి అశాంతి వాతావ‌ర‌ణం నెల‌కొనేలా చేసేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టే ఉన్నాయి ప‌రిస్థితులు. గ‌న్న‌వ‌రంలో ప‌ట్టాభిపై దా-డి రాష్ట్ర‌మంతా చూసింది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్గా పోస్టులు పెట్టి ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించిన అంజ‌న్ ని అక్ర‌మంగా అరెస్టు చేసి గే అంటూ ముద్ర‌వేశారు. టిడిపి సోష‌ల్ మీడియాకి ప‌నిచేస్తున్న అజ‌య్ అమృత్ కారులో గంజాయి పెట్టి అరెస్టు చేశార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి అవినీతి ప్ర‌శ్నించార‌ని సుబ్బారావు గుప్తాపై ఇప్ప‌టివ‌ర‌కూ చాలాసార్లు దా-డి చేశారు. తాజాగా ఆయ‌న కారులో గంజాయి పెట్టి అరెస్ట్ చేయించారు. ఇవ‌న్నీ చూస్తుంటే ఓటమి భ‌యంతోనే వైకాపా చేయిస్తోంద‌ని అర్థం అవుతోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read