నాలుగేళ్లుగా టిడిపి నేత‌లంద‌రిపైనా కేసులు పెట్టేసిన వైసీపీ పెద్ద‌లు ఏ ఒక్క కేసు నిల‌బ‌డ‌క‌పోవ‌డంతో కొత్త మార్గం ఎంచుకున్నారు. తీవ్ర‌మైన ప్ర‌జావ్య‌తిరేక‌త నుంచి ఘోర ఓట‌మి త‌ప్ప‌ద‌నే సంకేతాలు నేప‌థ్యంలో వైఎస్ జ‌గ‌న్ రెడ్డి ముందు ఇప్పుడు రెండే దారులు క‌న‌ప‌డుతున్నాయి. టిడిపిని త‌న వ్యూహాల‌తో ఉర‌క‌లెత్తిస్తున్న చంద్ర‌బాబుని ఏదో ఒక కేసులో అరెస్టు చేయించి జైలుకి పంపిస్తేనే, టిడిపి స్పీడుని ఆపొచ్చ‌నేది మొద‌టి జ‌గ‌న్ వ్యూహంగా విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. అయితే చంద్ర‌బాబుని అరెస్టు చేయించేందుకు స‌రిప‌డా ఏ కేసులోనూ ఆధారాలు చిక్క‌డంలేదు. స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ స్కాం, ఫైబ‌ర్ నెట్ కుంభ‌కోణం, రాజ‌ధాని భూములు, అమ‌రావ‌తి అవుటర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు, స‌చివాల‌యం నిర్మాణ సంస్థ‌తో లాలూచీ అంటూ కొత్త వాద‌న‌, ఐటీ కేసులంటూ ఎన్ని త‌వ్వితీసినా చంద్ర‌బాబుకి నోటీసు ఇచ్చే ఆధారాలు కూడా ఏమీ దొర‌క్క‌పోవ‌డంతో ఏమీ చేయాలో పాలుపోక జ‌గ‌న్ రెడ్డి గంద‌ర‌గోళానికి గుర‌వుతున్నాడ‌ని తాడేప‌ల్లి ప్యాలెస్ వ‌ర్గాల భోగ‌ట్టా. మూడు ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాల్లో జెల్ల కొట్టిన చంద్ర‌బాబు పంచుమ‌ర్తి అనూరాధ రూపంలో మ‌రో పంచ్ విసిరారు. ఈ వ‌ర‌స దెబ్బ‌ల‌తో అల్లాడిపోతున్న జ‌గ‌న్ రెడ్డి ఏకంగా చంద్ర‌బాబుని అరెస్టు చేయించాల‌నే బ‌రితెగింపు వ్యూహానికి దిగారు. అయితే ఏ కేసులో ఏ ఆధారాలు లేక‌పోవ‌డంతో ఉన్న‌తాధికారులు అటువంటి అరెస్టుకి దిగితే తాము దోషులైపోతామ‌ని ల‌బోదిబోమంటున్నార‌ట‌. మ‌రోవైపు ప్ర‌జావ్య‌తిరేక‌త‌, ఉద్యోగుల ఉద్య‌మం, ప్ర‌తిప‌క్షం బ‌లోపేతం అన్నింటినీ బేరీజు వేసుకుని...మ‌రింత కాలం ప‌ద‌విలో మ‌రింత వ్య‌తిరేక‌త పెరుగుతుంద‌ని..175 మాటేమో కానీ, ఉన్న 151లో 88 వ‌చ్చినా అధికారం నిల‌బెట్టుకోవ‌చ్చ‌నే ఆలోచ‌న‌లో ముందస్తుకి వెళ్లాల‌నే ఆలోచ‌న‌ని ఢిల్లీ పెద్ద‌ల వ‌ద్ద పెట్టార‌ని మ‌రో స‌మాచారం బ‌య‌ట చక్క‌ర్లు కొడుతోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read