డైవర్షన్ పాలిటిక్స్‌లో ఆరితేరిపోయిన వైసీపీ అధినేత జగన్ రెడ్డి, మరో ప్రమాదకర ఎత్తుగడకి తెరతీస్తున్నాడని అనుమానాలు వస్తున్నాయి. బాబాయ్ హత్యకేసులో అడ్డంగా బుక్కయిపోయిన అబ్బాయ్ అవినాశ్ రెడ్డి అరెస్టు తప్పదంటూ వార్తలు వచ్చాయి. అదే సమయంలో ఢిల్లీ వెళ్లి వచ్చాడు. అవినాష్ దర్యాప్తు కూడా ఆగిపోయింది. ఇదే సమయంలో సుప్రీంకోర్టు వివేకా హత్యకేసు ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదని వార్తలు వస్తున్నాయి. అవినాష్ రెడ్డి అరెస్టు అయితే దానిని డైవర్ట్ చేయడానికి ఏకంగా చంద్రబాబుని అరెస్ట్ చేయాలనే వ్యూహంతో జగన్ రెడ్డి పావులు కదుపుతున్నాడని అర్థం అవుతోంది. రాజధాని భూముల కేసులో ఏమీ చేయలేకపోయాడు. అలైన్ మెంట్ మార్పు పేరుతో టిడిపి కీలకనేత నారాయణ వైపు సీఐడీని పంపాడు. అదీ వర్కవుట్ అవ్వలేదు. మార్గదర్శి కేసులంటూ ఈనాడు రామోజీరావుపై దృష్టి సారించినా, అదీ బెడిసి కొట్టినట్టే ఉంది. ఎమ్మెల్సీల ఓటమి, వివేకా హత్య కేసు అరెస్టుల నుంచి ప్రజల దృష్టి మరల్చాలంటే ఏదైనా పెద్దది చేయాలనుకుంటున్నారని వైసీపీ క్యాంప్ నుంచి లీకులు వస్తున్నాయి. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ పేరుతో చంద్రబాబుని అరెస్టు చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని, బాబాయ్ హత్యకేసులో తమ అరెస్టులని జనం లైట్ తీసుకుంటారని..జగన్ భావిస్తున్నారని వైసీపీ నేతలే నర్మగర్భంగా చెబుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ దేశంలోనే అతి పెద్ద స్కామ్ అని, ఇందులో చంద్రబాబు, లోకేష్ అరెస్టు అవుతారని మంత్రి గుడివాడ అమర్ నాథ్ మీడియాకి చెబుతూ జగన్ రెడ్డి వ్యూహాన్ని చెప్పకనే చెప్పారు.
జగన్ నెక్స్ట్ డైవర్షన్ ప్లాన్ ఏంటి ? చంద్రబాబుని అరెస్ట్ చేస్తాడా ?
Advertisements