కొందరు మంత్రుల్ని తప్పించాలంటే, కొత్త వారికి అవకాశం కల్పించాలి. మంత్రివర్గ విస్తరణ వార్తలు ఊపందుకున్న వేళ రాజ్‌భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను సీఎం జగన్ రెడ్డి కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. విశాఖలో జరగనున్న జీ-20 సమావేశ వివరాలు తెలియజేశారని బయటకు చెబుతున్నా..కొత్తగా కొందరు మంత్రుల్ని తీసుకునే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. మార్చి 14నే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ముందుగా వార్తలొచ్చాయి. ప్రధానంగా ముగ్గరు మంత్రుల్ని తప్పిస్తారని జోరుగా ఊహాగానాలు సాగాయి. ఈ మధ్యే ఎమ్మెల్సీగా ఎన్నికైన మర్రి రాజశేఖర్, తోట త్రిమూర్తులు, పొన్నాడ సతీష్‌లను మంత్రివర్గంలోకి తీసుకుంటారని విశ్లేషణలు సాగాయి. మార్చి 14న మంత్రివర్గ విస్తరణ జరగకపోవడంతో తప్పిస్తారని టాక్ వినిపించిన మంత్రులు ఊపిరి పీల్చుకున్నారు. గుడివాడ అమర్ నాథ్, రోజా, జోగి రమేష్, విడదల రజిని, దాడిశెట్టి రాజా, సీదిరి అప్పలరాజులలో నలుగురిని తప్పిస్తారని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ వార్తల నేపథ్యంలోనే సీఎం గవర్నర్ ని కలిశారని వార్తలు వెలువడటంతో ఆశావహులు ఆశగా చూస్తున్నారు. కేబినెట్ బెర్తు కోల్పోతారని బయటకొచ్చిన పేర్లవారు ఆందోళనలో ఉన్నారు.
జగన్ ఆ మంత్రుల్ని పీకేసేందుకేనా గవర్నర్ భేటీ ?
Advertisements