వైఎస్ జగన్ రెడ్డి మళ్లీ ఢిల్లీ బయలు దేరుతున్నారు. మొన్ననే అసెంబ్లీ సమావేశాలను వదిలేసి మరీ ఢిల్లీ వెళ్లి వచ్చి తన తమ్ముడు వివేకానందరెడ్డి హత్యకేసులో అనుమానితుడైన అవినాశ్ రెడ్డి అరెస్టుని ఆపగలిగాడు. అయితే దర్యాప్తు అధికారిని బదిలీ చేయించలేకపోయాడు. అలాగే సుప్రీంకోర్టు వివేకా కేసు దర్యాప్తు ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తంచేయడంతో ఇంక అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదని నిర్ణయించుకున్న సీఎం జగన్ రెడ్డి మళ్లీ ఢిల్లీ బాటపట్టాడు. అవినాష్ రెడ్డి కూడా వివిధ కోర్టుల్లో రకరకాలుగా పిటిషన్లు వేస్తూ దర్యాప్తుని నీరుగార్చే ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో అరెస్టు తప్పదని నిర్ధారించుకున్నట్టున్నాడు. తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. వివేకా హత్య కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ అవినాష్ పిటిషన్ వేయడంతో ఈ కేసులో అవినాష్ రెడ్డి పాత్ర నిర్ధారణ అయ్యిందని, అరెస్టు తప్పకపోవచ్చని, అందుకే యాంటిసిపేటరీ బెయిల్ కోసం దరఖాస్తు చేశారని వైసీపీలోనే అంతర్గత చర్చ నడుస్తోంది. ఇప్పటికే మూడుసార్లు ఎంపీ అవినాష్ రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ, ఆధారాలు చిక్కడంతో అరెస్టు చేయవచ్చనే ఊహాగానాల నేపథ్యంలో బెయిల్ పిటిషన్ దాఖలుతో వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డి సాక్షి కాదు నిందితుడేనని స్పష్టం అవుతోందని న్యాయవాదులు చెబుతున్నారు.
జగన్ ఢిల్లీ టూర్ వెనుక ఇంత స్కెచ్ ఉందా ?
Advertisements