స్టాన్ ఫోర్డులో చదివినా నారావారిపల్లె కుర్రాడిని అనిపించుకున్నాడు నారా లోకేష్. వరల్డ్ బ్యాంకులో వర్క్ చేసినా సీమపల్లెల చిన్నోడినే అని నిరూపించుకున్నాడు. యువగళం పాదయాత్ర ప్రారంభం రాయలసీమనే ఎంపిక చేసుకున్నారు. రాయలసీమ వైసీపీ వాళ్ల తాత జాగీరులా లోకేష్‌ని అడుగుపెట్టనివ్వమంటూ బీరాలు పలికారు. నేనూ సీమ బిడ్డనేనని నినదించారు. యువగళం జనస్వరమై దిగ్విజయంగా పూర్తి చేశారు. కడప జిల్లా సీఎం జగన్ రెడ్డి, చిత్తూరు జిల్లా షాడో సీఎం పెద్దిరెడ్డి, అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ అనంత వైసీపీ లీడర్లు, కర్నూలులో కరడుగట్టిన నేరగాళ్లయిన వైసీపీ పెద్దలని అవినీతి కోటలు బద్దలు కొట్టి మరీ మీసం మెలేసి లోకేష్ సవాళ్లు విసిరారు. కుప్పంలో ప్రారంభించి బద్వేలు నియోజకవర్గం వరకూ 124 రోజులపాటు 44 నియోజవకర్గాలలో 1587 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. కుప్పంలో యువగళం చినుకుగా మొదలై రాయలసీమ ముగిసేనాటికి జనసంద్రమై ఎగిసింది. రాయలసీమ పాదయాత్రలో వలసలు, రైతుల అగచాట్లు, పేదల కన్నీళ్లు చూశాడు. ప్రతిరంగమూ కుదేలై ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. కుల,మతాలకు అతీతంగా లోకేష్ వెంట జనం నడిచారు. 4 నెలల రాయలసీమలో సాగిన యువగళంలో పరిశీలించిన సమస్యలు, తన దృష్టికి వచ్చిన డిమాండ్లు, ప్రజల ఆవేదనలు తీర్చే విజన్‌ని సిద్ధం చేశారు. అదే మిషన్ రాయలసీమ. టిడిపికి అధికారం ఇవ్వండి-అభివృద్ధి చేసి చూపిస్తామంటూ ప్రజలని చైతన్యం చేశారు. రాయలసీమలో పాదయాత్ర పూర్తి చేసుకుని నెల్లూరులోకి అడుగు పెట్టేముందు జన్మభూమికి ముద్దాడి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆత్మీయ ప్రేమని పంచిన రాయలసీమ గడ్డని మరువడు ఈ బిడ్డ అంటూ ప్రతినబూనాడు.
వైసీపీకి డేంజర్ బెల్స్.. యువగళం దెబ్బకు రాయలసీమలో టిడిపి ఇంతలా పుంజుకుందా ?
Advertisements