అంబ‌టి రాయుడు ముక్కుసూటి క్రికెట‌ర్. బ్యాటుతోనూ, మాట‌ల‌తోనూ స‌మాధానం చెప్ప‌గ‌ల ఎగ్రెసివ్ నెస్ ఆయ‌న సొంతం. ఇండియా టీమ్‌కి ఆడినా, ఐపీఎల్ లో సీఎస్‌కేతో జ‌ర్నీ చేసినా అంబ‌టి రాయుడు స్టైలే వేరు. అంత‌ర్జాతీయ మ్యాచుల్లో యాటిట్యూడ్-పాలిటిక్స్ వ‌ల్ల అవ‌కాశాలు ద‌క్క‌క‌పోవ‌డంతో రిటైర్మెంట్ ప్ర‌క‌టించేశాడు. అంబ‌టి రాయుడుకి క్రికెట్లో జ‌రిగిన అన్యాయం ప‌ట్లా అంద‌రిలోనూ సానుభూతి ఉంది. ఐపీఎల్ ముగిసిన వెంట‌నే రాయుడు వేసిన పొలిటిక‌ల్ ఫ్రంట్ ఫుట్ అంబ‌టిపై ఉన్న సాఫ్ట్ కార్న‌ర్‌ని దూరం చేసింది. ఐపీఎల్లో ఆడుతూనే జ‌గ‌న్ రెడ్డి పాల‌న‌ని ప్ర‌శంసిస్తూ ట్వీట్లేసిన రాయుడు ..అనంత‌రం సీఎంని క‌లిసి వైసీపీలో చేర‌డానికి సిద్ధంగా ఉన్నానంటూ సంకేతాలు పంపారు.  వైసీపీ అనుకూల మీడియా చాన‌ళ్ల‌కి వైసీపీ లైనులో ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు. దీనికంత‌టికీ స్కెచ్ ఐప్యాక్ ఆఫీసులో రెడీ అవుతోంది. అంబ‌టి రాయుడు క్ర‌మం త‌ప్ప‌కుండా ఐప్యాక్ ఆఫీసులో కోర్ టీముతో భేటీ అయిన త‌రువాతే వైసీపీ అనుకూల చాన‌ళ్ల‌కి ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నార‌ని తెలుస్తోంది. అంబ‌టి రాయుడుని పేటీఎం టీములాగే వైసీపీ వాడుతోంద‌ని తెలుస్తోంది. అంబ‌టిరాయుడులాంటి వారితో కుల‌, ప్రాంత విద్వేషాలు రెచ్చ‌గొట్టించి వైసీపీ అందులో చ‌లికాచుకుని రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు పొందేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read