జగన్ రెడ్డిని చంద్రబాబు సైకో అంటారు. సీఎంగా ఉండి జగన్ రెడ్డి చేష్టలు సైకోని తలపిస్తూ చంద్రబాబు మాటల్ని నిజం చేస్తున్నాయి. కుప్పం ఎమ్మెల్యే, ప్రతిపక్షనేత చంద్రబాబుని ఆయన నియోజకవర్గంలో పర్యటించడానికి వీల్లేదని అడ్డుకున్నారు. అంతకుముందు పల్నాడులో బాధితుల్ని పరామర్శించేందుకు వెళితే చంద్రబాబు ఇంటికి పోలీసులు తాళ్లతో కట్టి నిలువరించారు. ఇలా అడుగడుగునా చంద్రబాబుని అడ్డుకుంటూ వస్తూన్న జగన్ రెడ్డి సర్కారు తాజాగా తన నియోజకవర్గం కుప్పంలో బాబు సొంత ఇల్లు నిర్మించుకోకుండా ప్రభుత్వం అడ్డుకుంటోంది. నిర్మాణానికి అనుమతుల కోసం దరఖాస్తు చేసి ఏడాది గడచినా అనుమతులివ్వకుండా తాత్సారం చేస్తోంది. కుప్పంలో సొంత ఇంటి నిర్మాణం కోసం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం శివపురం సమీపంలో కుప్పం-పలమనేరు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న సుమారు రెండెకరాల స్థలాన్ని చంద్రబాబు కొనుగోలు చేశారు. దీనిని రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఇంటి నిర్మాణం కోసం అన్ని పత్రాలతో దరఖాస్తు చేశారు. అథారిటీ సర్వేయర్ సర్వే చేశారు. పత్రాలు సమర్పించలేదని ఇచ్చిన సమాచారంతో మళ్లీ సంబంధిత పత్రాలను ఉడాకు అందజేశారు. గుంటూరులోని డైరెక్టర్ ఆఫ్ కంట్రీ టౌన్ అండ్ ప్లానింగ్‌కు కూడా ఈ ఏడాది జనవరి రెండో వారంలో స్థలానికి సంబంధించిన అన్ని పేపర్లు పంపించినా, అనుమతి ఇవ్వడం లేదు. నిబంధనల ప్రకారం అన్ని దరఖాస్తులు పూర్తిచేసి పత్రాలు అందజేసినా అనుమతులు రాకపోవడం వెనుక సైకో పాలకుల ఒత్తిడి ఉందని తెలుస్తోంది.
కుప్పంలో చంద్రబాబు ఇంటి నిర్మాణం పై వైసీపీ మార్క్ కక్ష సాధింపు
Advertisements