వైసీపీకి చెందిన రెండు చానళ్లు, వైసీపీ కోసం అదే చానళ్లలో పనిచేసే ఇద్దరు మహిళలు దారుణంగా కలబడి మరీ కొట్టుకున్నారు. సీఎం క్యాంప్ ఆఫీసు మీడియా పాయింట్ దగ్గర జరిగిన ఈ గొడవల్లో ఒకరిని ఒకరు రక్కుకుంటూ, గిచ్చుకుంటూ, తిట్టుకుంటూ వీడియోలు కూడా తీసుకుని సోషల్ మీడియాలో పోస్టులు చేసుకున్నారు. వీళ్లిద్దరూ బయటకు చెబుతున్నట్టు ఒకరు లైవ్ పెట్టినప్పుడు ఇంకొకరు లైవ్ మైకులు పెడుతున్నారని చెబుతున్నా...ఇద్దరి మధ్యా వివాదానికి ఇద్దరు `ముఖ్య`మైన వ్యక్తులు కారణం అని తెలుస్తోంది. ఒకరు ముఖ్యనేత పీఆర్ టీములో కీలకంగా ఉంటే..ఇంకొకాయన సలహాల సామ్రాజ్యాన్ని ఏలేవారని తెలుస్తోంది. పీఆర్ టీములో కీలక వ్యక్తి టీవీ9 హసీనాకి మద్దతుగా నిలిస్తే.. సలహాల పెద్దాయన ఎన్టీవీ రెహానాకి అండ అని తెలుస్తోంది. ఇద్దరి గొడవ సందర్భంగా కూడా సలహాల పెద్దాయన పేరే ప్రస్తావనకి రావడం విశేషం. ఎస్సార్కే సార్ కి నీ గురించి తెలియదు, ఆయన దగ్గరే తేల్చుకుందాం అని హసీనా మాటలు రికార్డు అయి ఇప్పుడు మీడియా వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ఎవరా ఎస్సార్కే సార్! ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. tv9 హసీనా, NTV రెహానా మధ్య సీఎంవో లో ఆధిపత్యం కోసం నిత్యం గొడవలు జరుగుతున్నాయని, వీరిద్దరికీ సీఎంవోలో ఇద్దరు పెద్దలు ఆశీస్సులుండడంతో ఇది కొట్టుకునే వరకూ దారి తీసిందని సమాచారం. ఇద్దరు మహిళా జర్నలిస్టుల తీరుపై అటు యాజమాన్యాలు, ఇటు సీఎంవోలో వత్తాసు పలికిన వారు, వైసీపీ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. వీరి తీరుతో వైసీపీ రోడ్డున పడిందని, యాజమాన్యాలు కూడా వైసీపీతోపాటే బద్నాం అయ్యాయని కోపంగా ఉన్నారు. వైసీపీ పెద్దల ఆదేశాలతో ఎన్టీవీ రెహానా ను విశాఖకి, టీవీ9 మేనేజ్మెంట్ హసీనా హైదరాబాద్ కు బదిలీ చేసిందని విశ్వసనీయ సమాచారం.
టీవీ9 హసీనా..ఎన్టీవీ రెహానా ఎందుకు కొట్టుకున్నారు ?
Advertisements