అమరావతిలో ఆర్-5 జోన్లో పేదల ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా జనాన్ని సమీకరించాలని అధికారులు ఆదేశించారు. లబ్ధిదారులందరూ తప్పకుండా రావాలని వారు ఒత్తిడి చేస్తున్నారు. అయితే, లబ్ధిదారులు కొందరు కార్యక్రమానికి రావడానికి ఇష్టపడటం లేదు. అధికారులు కార్యక్రమానికి రావడం తప్పనిసరి అని చెబుతున్నారు. వారు రాకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి 1,100 ఆర్టీసీ, 400 ప్రైవేటు బస్సులను సిద్ధం చేశారు. ఈ బస్సుల ద్వారా లబ్ధిదారులను అమరావతిలోని కార్యక్రమానికి తరలించనున్నారు. భారీ వర్షం పడినా సరే కార్యక్రమం ఆగకూడదని, జనాలని తోలుకు రావలసిందే అని గుంటూరు, కృష్ణా జిల్లా అధికారుల ఆదేశాలు ఇచ్చారు. నెల కూడా అవ్వలేదని, మొన్ననే పనులు మానుకుని వచ్చామని, ఈసారి రాలేమంటున్నా, ససేమిరా అంటు వలంటీర్లు ఒత్తిడి చేస్తున్నారు.
వర్షం పడినా సరే తోలుకు రావాల్సిందే.. జగన్ మీటింగ్ లో జనాలని చూపించుకోవటానికి అధికారుల పాట్లు
Advertisements