జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో, ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటం, ఇక తాము ఎలాగూ గెలవం అనే అభిప్రాయం వైసీపీలో ఉండటంతో, రేపు వచ్చే చంద్రబాబు ప్రభుత్వం ఇబ్బంది పడే విధంగా, అనేక తిక్క తిక్క నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే అమరావతిలో ఇళ్ల పట్టాల కోసం మరో 268 ఎకరాలు కేటాయించింది జగన్ ప్రభుత్వం. తంలో R3 జోన్‍లో ఉన్న గ్రామాల్లో 1134.58 ఎకరాలు ఇప్పటికే కేటాయించారు. అయితే రెండు జిల్లాల కలెక్టర్ల వినతితో, మరో  268 స్థలాల కేటాయింపు చేసారు. ఈ నెల 18న జగన్ చేతుల మీదుగా పట్టాల పంపిణీ జరగనుంది. అయితే, ఈ విషయం పై ఇప్పటికే సుప్రీం కోర్టుకి వెళ్లారు రైతులు. ఇది ఇలా ఉంటే, ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా, సంచలన నిర్ణయం తీసుకుని, కొలికపూడి శ్రీనివాసరావు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ విధ్వంసానికి నిరసనగా ఈ దీక్ష చేస్తున్నట్టు ఆయన తెలిపారు. అబ్బురాజుపాలెం అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read